Andamaina Golla Kosam Konni Tips
Nail care tips homemade, home made beauty tips, homemade tips for nail growt, tips for growing longer nails: Mana sharira soundaryamlo gollaku yentho pradhaanyatha vundi. ee vishayam teliyaka mana daggara chaakaa mandi golla aarogyaanni, andaanni nirlakshyam chestuntaaru.koncham shraddha teesukunte chaalu mee gollanu yentho andangaa teerchididdukovacchu.
అందమైన గోళ్ల కోసం...
శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలియక మన దగ్గర చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే చాలు మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
* గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి. అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు.
* గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదోనని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లుగా గుర్తించాలి.
* గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని వదిలేయండి. సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు నెర్రులిచ్చే అవకాశం ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్ ఈ, ఎ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఇవన్నీ లభించేలా తగిన పోషకాహారం తీసుకోవాలి.
* గృహిణులు, ఇంటి పనుల్లో తలమునకలై ఉండేవారు ఎప్పటికప్పుడు సోప్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. లేకుంటే హానికారక బ్యాక్టీరియా గోళ్లలో చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
* గోళ్లు పెళుసుగా ఉంటే వేడినీళ్లలో కొంత నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీము లేదా లోషన్ రాసుకోవాలి.
* గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే. కానీ ఎల్పప్పుడూ గోళ్లను రంగులతో కప్పివేయకూడదు.
* వారానికి రెండు సార్లు మ్యానిక్యూర్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరం.
* గోళ్లరంగును తొలగించడం కోసం అసిటోన్ కలసిన నెయిల్‌పాలిష్ రిమూవర్‌ను వాడకండి. అసిటోన్ కలవని సాధారణ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడడమే మేలు.
* మొత్తటి ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు
* నిమ్మరసం - 2 చుక్కలు
* వీట్‌జెర్మ్ ఆయిల్ - 2 చుక్కలు
* వీటిని ఒక కప్పు నీటిలో కలిపి పది నిమిషాలపాటు వేలి గోళ్లను మునిగేలా ఉంచాలి. తర్వాత టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే అందమైన గోళ్లు మీ సొంతమవుతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తక్కువ కాలంలో చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.
* విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు సుతిమెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.
* గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఓ 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
* హానికారకరమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్‌గ్లోవ్స్ ధరించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు.