స్టీవియాతో మధుమేహం దూరం

 Information about using stevia with diabetes safe for sugar alternative for diabetics stevia better healthy living

మధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు తినేందుకు వెనుకాడుతుంటారు. కాని తీపి పదార్థాలను తిన్న తర్వాత మధుపత్రిని నమిలితే శరీరంలో చక్కెర శాతం అదుపులో వుంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

 Information about using stevia with diabetes safe for sugar alternative for diabetics stevia better healthy living

స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్‌లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కల్గివుంటాయి. వీటినుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార స్టీవియా ఆకుల నుంచి తీసిన పంచదార ఒక స్పూనుతో సమానం. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగకమానదు. మన దేశంలోనే కాదు ఇప్పుడు విదేశాల్లోనూ స్టీవియా మొక్కలను పెంచుతున్నారు…అచ్చ తెలుగులో దీనిని మధుపత్రం అని అంటారు.

చెరకు కన్నా తీపి…

 Information about using stevia with diabetes safe for sugar alternative for diabetics stevia better healthy living

మధుపత్రి ఆకుల్లో చెరకు కన్నా మూడింతల తీపు వుంటుంది. భోజనం చేసే ఇరవై నిమిషాల ముందు మధుపత్రి (స్టీవియా) ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. ఈ మొక్కలను ఇంట్లోను పెంచుకోవచ్చు. మధుపత్రి ఇన్సులిన్‌ను విడుదల చేయడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. మధుపత్రి సేవిస్తుంటే మధుమేహ వ్యాధితోపాటు రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌, దంతాలు, గ్యాస్‌, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

 Information about using stevia with diabetes safe for sugar alternative for diabetics stevia better healthy living

స్వీట్‌ స్టీవియా ఇది అత్యంత తియ్యదనం కలిగిన ఔషదీయ మొక్క. కేవలం దీని పచ్చి ఆకులను తమలపాకుల్లా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే చాలు నోటి క్యాన్సర్‌ వంటి వ్యాధులు క్రమేణా దూరమవుతాయి. అంతేకాదు నోటి దుర్వాసన పోగొట్టే మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా దీనిని ఉపయోగించ వచ్చు. మామూలుగా పంచదార తింటే అనేక వ్యాధులు వస్తాయి. కానీ స్టీవియాతో తయారైన పంచదార తీసుకుంటే ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు కలిగించకపోగా… మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా నిర్భయంగా దీనిని తీసుకోవచ్చు.

ఆరోగ్య సంజీవని…

 Information about using stevia with diabetes safe for sugar alternative for diabetics stevia better healthy living

స్టీవియాను తీసుకుంటే మన శరీరంలో ఎటువంటి అదనపు క్యాలరీలు చేరవు. దీంతో రక్తంలోని గ్లూకోజ్‌లో ఏరకమైన మార్పు ఉండక… పెరిగిన నిల్వలను తగ్గించి గ్లూకోజ్‌ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో స్టీవియా అమోఘంగా పనిచేస్తుంది. ఇది కేవలం డయాబెటీస్‌ వ్యాధిగ్రస్తులకే కాక… అధిక రక్తపోటును తగ్గించడంలో, అంతకంతకూ పెరిగిపోతున్న ఊబకా యాన్ని స్థిరీకరించడంలో, దంత వ్యాధుల నివారణలో సంజీవినిలా పనిచేస్తుందని శాస్ర్తీయ పరిశోధనలలో తేలింది. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు మనలో రోగనిరోధక శక్తిని పెంచడంలో… అత్యంత వేగవంతం గాను… సమర్థవంతంగాను పనిచేస్తాయని తేలింది.

ఎక్కడ పుట్టింది?

 Information about using stevia with diabetes safe for sugar alternative for diabetics stevia better healthy living

ఇన్ని సుగుణాలు ఉన్న ఈ మొక్క ఎక్కడ పుట్టిందో తెలుసా… ఇది పెరుగ్వే దేశంలో ఎక్కువగా కాలువల పక్కన, కొలనుల వద్ద విచ్చలవిడిగా పెరిగేది. దీనిని ఆ ప్రాంతం వారు కొన్నిశతాబ్దాలుగా ఔషధ విలువలు కలిగిన మొక్కగా గుర్తించి విరివిగా వాడుతుండేవారు. ఆ ప్రాంతంలో ఉండే ఆదివాిసీలుగా పిలువబడే గ్వారాని ఇండియన్లు దీనిని ‘క్వాహీహీ అని పిలిచేవారట. క్వాహీహీ అంటే తీపి మొక్క అని అర్థం.

దేశ,దేశాలలో…

 Information about using stevia with diabetes safe for sugar alternative for diabetics stevia better healthy living

సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ మొక్కలలోని విశేష గుణాలను జపనీయులు గుర్తించారు.గుర్తించడమే గాక దీనిని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అక్కడి నుండి చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా, తైవాన్‌ వంటి దేశాలు వీటి సాగు మీద శ్రద్ధవహించాయి. ఇటీవలే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థల గుర్తింపు వచ్చింది.