తలనొప్పికి చాలా కారణాలున్నాయి. అందులో నిద్ర లేకపోవడం, టెన్షన్స్, మానసిక ఒత్తిడి, జలుబు వంటి తదితర కారణాలు... మరీ తలనొప్పి పోవడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుందామా?
 

శొంటిని మెత్తగా పొడిచేసి, వేడి చేసిన పాలలో వేసి రెండు లేదా మూడు చుక్కలు ముక్కులో వేస్తె తలనొప్పి తగ్గిపోతుంది.

తంగేడు ఆకును మెత్తగా దంచి(నూరి) నుదిటిపై పట్టిగా వేస్తె తలనొప్పి తగ్గిపోతుంది.

ఒక చెంచాడు మునగ ఆకు రసంలో మూడు మిరియాలను పొడిచేసి కలిపి, కణతలపై రాసుకుంటే తలనొప్పి పోతుంది.

ముక్కులో కాఫీ డికాషన్ చుక్కలు వేస్తె నొప్పి తలనొప్పి తగ్గిపోతుంది.

వావిలకును నూరి ఆ మిశ్రమాన్ని నుదుటికి పట్టి వేస్తె తలనొప్పి తగ్గుతుంది.