బంగాళాదుంపతో పిగ్మెంటేషన్ దెబ్బకు మాయమవుతుంది!
చర్మ సమస్యలు మొటిమలు, చిన్న మచ్చలు మాత్రమే కాదు, చర్మం అక్కడక్కడా రంగుమారడం కూడా ముఖ చర్మాన్ని దెబ్బతీస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ తీవ్రమైన చర్మ సమస్యగా పరిగణిస్తుంటారు. ఒకసారి ఈ సమస్యలు మొదలైతే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. స్కిన్ పిగ్మెంటేషన్ అనేక కారణాల వల్ల కావచ్చు. వీటిలో ముఖ్యమైనది అధిక మెలనిన్ ఉత్పత్తి. దీని కారణంగా ముఖం మీద పెదవుల చుట్టూ, ముక్కు ఇరువైపులా, కళ్లకింది భాగంలోనూ చర్మం రంగు మారి కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని గురించి చింతించాల్సిన పనిలేదు. ఈ పిగ్మెంటేషన్ ను సమర్థవంతంగా తొలగించడంలో బంగాళాదుంప అధ్బుతంగా పనిచేస్తుంది. బంగాళాదుంపలలో ఎంజైమ్‌లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, ఇవి డార్క్ స్పాట్‌లను తేలికపరచడానికి, చర్మపు రంగును సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడతుంది. ఇందుకోసం బంగాళాదుంపను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే..
పిగ్మెంటేషన్ తొలగించడానికి బంగాళాదుంపను ఎలా ఉపయోగించాలి?
బంగాళదుంప రసం టోనర్..
బంగాళాదుంప రసం సహజ టోనర్‌గా అద్భుతంగా పనిచేస్తుంది, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. పిగ్మెంటేషన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టోనర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్స్‌ని తగ్గించి, స్కిన్ టోన్‌ను పెంచడంలో సహాయపడుతుంది.
బంగాళాదుంప టోనర్ ఎలా చేయాలంటే..
బంగాళాదుంప టోనర్ చేయడానికి, ఒక బంగాళాదుంపను చెక్కు తీసి దాన్ని సన్నగా తురుముకోవాలి. తరువాత గట్టిగా పిండితే రసం వస్తుంది. దీన్ని ఒక చిన్న కప్ లో తీసుకోవాలి.
ముఖం మీద మచ్చలు, రంగు మారిన ప్రాంతాలను కవర్ చేస్తూ కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్ సహాయంతో రసాన్ని నేరుగా ముఖంపై అప్లై చేయాలి.
దీన్ని 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
బంగాళాదుంప మాస్క్
బంగాళాదుంప ముక్కలు చర్మానికి చల్లదనాన్ని, మృదువు స్వభావాన్ని కలిగిస్తాయి. పిగ్మెంటేషన్ ద్వారా చికాకు లేదా ఎర్రబడిన ప్రాంతాలను నయం చేయడంలో సహాయపడతాయి.
బంగాళాదుంపను మందపాటి చక్రాలుగా కట్ చేసి వాటిని ముఖం మీద ప్రభావిత ప్రాంతాలలో ఉంచాలి.
ఈ ముక్కలను సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై ముఖాన్ని నీటితో కడగాలి.
దీన్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటే కాలక్రమేణా ముఖ చర్మం మీద ఎరుపు, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
బంగాళదుంప, నిమ్మరసం ఫేస్ ప్యాక్..
బంగాళాదుంప రసానికి సమాన మొత్తంలో తాజా నిమ్మరసం మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
ఈ ప్యాక్ ను 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నిమ్మరసం కొద్దిగా జలదరింపును కలిగిస్తుంది, కాబట్టి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం.
15నిమిషాల తరువాత దీన్ని శుభ్రమైన నీటితో కడిగేయాలి.
బంగాళాదుంప , తేనె ప్యాక్..
ఒక టీస్పూన్ తేనెతో మిక్సీ పట్టిన బంగాళాదుంప పేస్ట్ కలపాలి. దీన్ని మందపాటి పేస్ట్ గా తయారు చేసుకోవాలి.
ఈ పేస్ట్ ను ముఖంపై సమానంగా అప్లై చేసి 20-25 నిమిషాలు అలాగే ఉంచండి.
20-25 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ చర్మానికి పోషణను ఇవ్వడమే కాకుండా ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమట తాలూకు గుర్తులు తొలగిస్తుంది.
*నిశ్శబ్ద.