నార్మల్ డెలివరీ కోసం అమ్మమ్మల కాలం నాటి చిట్కా..!
నార్మల్ డెలివరీ చాలామంది అమ్మాయిలు చాలా సంకోచం వ్యక్తం చేస్తారు దీని గురించి. నార్మల్ డెలివరీ కి భయపడి సి-సెక్షన్ చేయించుకోవాలని అనుకుంటారు. అయితే నార్మల్ డెలివరీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయిన రోజులు ఉన్నాయి. పెద్దవాళ్లందరూ నార్మల్ డెలివరీ ద్వారానే పదుల కొద్ది పిల్లలను కూడా కన్నారు. కానీ నేటికాలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా మహిళలకు నార్మల్ డెలివరీని భరించే అంత శక్తి, అంత ఓపిక ఉండటం లేదు. ఇప్పట్లో చాలా వరకు పెద్ద హాస్పిటల్స్ కూడా నార్మల్ డెలివరీ కోసం మహిళలకు వ్యాయామాల దగ్గర నుండి మెంటల్ గా బలోపేతం చేయడానికి ఎన్నో చేస్తున్నారు. అయితే నార్మల్ డెలివరీ కావాలి అనుకునేవారికి అమ్మమ్మల కాలం నాటి ఆహార చిట్కా తెలుసుకోండి మరి..
నెయ్యి, గంజి..
అన్నం అనేది ప్రధాన ఆహారం. అయితే అన్నం ఉడికేటప్పుడు గంజి వార్చడం చాలామంది చేస్తారు. బియ్యం ఉడికేటప్పుడు వాటి నీటిని వేరు చేయాలి. ఈ నీటిలో రెండు చెంచాల దేశీ నెయ్యి వేసి బాగా కలిపి ఆ నీటిని తాగాలి.
9వ నెల గర్భంలో ఈ ఆహార చిట్కా ను ప్రయత్నించడం వల్ల చాలామేలు జరుగుతుంది. శరీరంలో కండరాలు బలపడి, సాధారణ డెలివరీకి అనుగుణంగా కండరాలు అడ్జస్ట్ అవుతాయి. ఇవి మాత్రమే కాకుండా నార్మల్ డెలివరీ జరగాలంటే మరిన్ని పెద్దవాళ్లు చెప్పిన చిట్కాలు పాటించవచ్చు.
వాకింగ్..
గర్బం దాల్చిన మహిళలు నార్మల్ డెలివరీ కావాలని అనుకుంటే చివరి నెలలలో వాకింగ్ బాగా చెయ్యాలి. ఇది కాలి తొడలు, తొడ కండరాలను బలోపేతం చేస్తుంది. అలాగే మెట్లు ఎక్కడం కూడా మంచిదే.
బాల్ వ్యాయామం..
ఈ మధ్య చాలామంది గర్భవతులు నార్మల్ డెలివరీ కోసం బాల్ వ్యాయామం చేస్తుండటం గమనించవచ్చు. దీన్ని వైద్యులే సిఫారసు చేస్తున్నారు. పెద్ద ఎక్సర్జైజ్ బాల్ ను తీసుకుని బాల్ మీద కూర్చుని వలయాకారంగా, ముందుకు వెనక్కు మెల్లిగా పొట్ట,పిరుదుల భాగాన్ని కదిలించడం వల్ల గర్భాశయం కండరాలు బలంగా మారతాయి. ప్రసవానికి తగినట్టు ప్రసవ ద్వారం అనుకూలం అవుతుంది.
శ్వాస వ్యాయామాలు..
గర్భధారణ సమయంలో లోతుగా శ్వాస తీసుకోవడం అనే వ్యాయామం చాలా మంచిది. ఇది గర్భాశయం ద్వారాన్ని ప్రసవానికి సిద్దం చేయడంలో బాగా సహాయపడుతుంది.
వేడి నీరు స్నానం..
వేడినీరు స్నానం శరీరానికి బాగా విశ్రాంతిని ఇస్తుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
మసాజ్..
గర్భం దాల్చిన ఏడవ నెల తరువాత శరీరం దిగువ బాగాన్ని మసాజ్ చేయడం వల్ల శరీర దిగువ భాగం బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. కండరాలు కూడా బిగుతుగా ఉంటాయి.
*రూపశ్రీ.
