మహిళలకు గర్భాశయ క్యాన్సర్ రాకూడదు అంటే.. ఈ టిప్స్ పాటించాలి..!
క్యాన్సర్ మనిషి జీవితాన్ని చాలా చిన్నాభిన్నం చేస్తుంది. ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెట్టే క్యాన్సర్ లలో రొమ్ము క్యాన్సర్ తరువాత గర్బాశయ క్యాన్సర్ ఏ ఎక్కువ ప్రమాదం. గర్భాశయ క్యాన్సర్ నే సర్వైకల్ క్యాన్సర్ అంటారు. క్రమంగా మహిళలలో నమోదు అవుతున్న క్యాన్సర్ కేసులలో గర్భాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. అసలు గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? గర్భాశయ క్యాన్సర్ నుండి దూరంగా ఉండాలంటే మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలుసుకుంటే..
మహిళలో గర్భాశయ క్యాన్సర్ కు హ్యుమన్ పాపిల్లోమా వైరస్ ప్రధాన కారణం. ఈ వైరస్ ఏకంగా మహిళలను ప్రాణాపాయంలోకి నెట్టేస్తుంది. ఈ వైరస్ బారిన మహిళలు పడకుండా ఉండాలంటే.. మహిళలు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలి. దీని వల్ల వైరస్ ఇన్పెక్షన్ ను నివారించవచ్చు.
హ్యూమన్ పాపిల్లో వైరస్ టీకా 9, 26 సంవత్సరాల మధ్య చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే ఈ టీకా వేయించుకునే విషయంలో మొదటగా డాక్టర్ సలహా తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి వ్యాక్సిన్లు అస్సలు వేయించుకోకూడదు.
మహిళలు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఆ వైద్య పరీక్షలలో పాప్ స్మియర్ పరీక్ష తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే పాప్ స్మియర్ పరీక్ష గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళలు 21 సంవత్సరాలు దాటిన తరువాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలట. ఇది గర్భాశయ క్యాన్సర్ నివారించడంలోనూ.. మహిళలకు అమ్మతనం దూరం కాకుండా చేయడంలోనూ చాలా సహాయపడుతుంది.
వివాహం అయిన మహిళలు తమ భాగస్వామితో సెక్స్ జీవితంలో తప్పనిసరిగా ఉంటారు. అయితే సురక్షితమైన సెక్స్ లైప్, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం వంటివి మహిళలకు తీవ్రమైన వ్యాధులు రాకుండా సహాయపడతాయి. అలాగే గర్భాశయ క్యాన్సర్ రాకూడదు అంటే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. పొగ తాగడమే కాదు.. ఇతరులు పొగ తాగుతున్నప్పుడు ఆ పొగను పీల్చడం కూడా ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బతీస్తుంది.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
*రూపశ్రీ
