సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ - డయాస్టాలిక్ బ్లడ్ ప్రెజర్

Systolic Blood Pressure -  Diastolic Blood pressure

ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, కీళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం, ఏదైనా తింటే ఆరోగ్యం చెడి పోతుందని తెలిస్తే చాలు, దానికి అన్ని రకాలుగా ఉండటానికి ప్రయత్నిస్తాం, అదే క్రమంలో అప్పుడప్పుడు బి. పి. ని కూడా చెక్ చేస్తూ ఉండటం మరిచిపోకూడదు. ఎందుకంటే హై బి. పి. అయినా లో బి. పి. అయినా సమస్య తీవ్రమైతే గానీ, దాని లక్షణాలు పైకి కనబడవు, సమస్య తీవ్రమయ్యాక ఇబ్బందులు పడే కంటే దాని గురించి ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు పాటించడం మంచిది. 

బ్లడ్ ప్రెజర్ సాధారణ స్థాయిని మించినప్పుడు దానిని సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అంటారు.దీనినే

హై బి. పి. అంటాం.

బ్లడ్ ప్రెజర్ సాధారణ స్థాయి నుండి తగ్గినప్పుడు డయాస్టాలిక్ ప్రెజర్ అంటారు. దీనిని మనం లో బి పి అంటాం. 

హై బ్లడ్ ప్రెజర్ లక్షణాలు 

తొందరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం, చెమటలు పట్టడం...

లో బ్లడ్ ప్రెజర్ లక్షణాలు
చిన్న పనులకే అలసిపోవడం, నీరసంగా ఉండటం, అస్తమానం నిద్ర మత్తులో ఉండటం, చివరిగా బి పి లో అయితే కోమా లో కి వెళ్ళే ప్రమాదముంది.

బ్లడ్ ప్రెజర్ రీడింగ్
సిస్టాలిక్ - డయాస్టాలిక్
210 - 120 - స్టేజ్ 4 హై బ్లడ్ ప్రెజర్
180 - 110 -
స్టేజ్
3 హై బ్లడ్ ప్రెజర్
160 - 100 -
స్టేజ్
2 హై బ్లడ్ ప్రెజర్
140 - 90 -
స్టేజ్
1 హై బ్లడ్ ప్రెజర్
140 - 90 - బార్డర్ లైన్ హై బ్లడ్ ప్రెజర్ స్టేజ్
130 - 85 - హై నార్మల్ బ్లడ్ ప్రెజర్ స్టేజ్
120 - 80 - నార్మల్ బ్లడ్ ప్రెజర్
110 - 75 -
లో నార్మల్ బ్లడ్ ప్రెజర్

90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్
60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్
50 - 33 -
డేంజర్ బ్లడ్ ప్రెజర్

హై బి.పి. కి కారణాలు : కొన్ని సార్లు మనం వాడే మందులు కూడా హై బి.పి. కి కారణం కావచ్చు, ఉదాహరణకు అస్తమా, థైరాయిడ్, లేదా ఇంకేవైనా మందులు వాడుతున్నప్పుడు హై బి.పి. కి గురయ్యే అవకాశముంది.ముఖ్యంగా మహిళల్లో ప్రెగ్నెన్సీ రాకుండా మందులు వేసుకోవడం వల్ల హై బి.పి. సమస్య రావచ్చు, అందుకే ఏ చికిత్స తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు బి. పి.లెవెల్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. దానితో పాటు ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం,ఆహారంలో సోడియం శాతం అధికమవ్వడం వల్ల కూడా హై బి.పి. కి గురి అయ్యే అవకాశాలున్నాయి.

హై బి. పి. శరీరానికి జరిగే నష్టాలు

  • హార్ట్ ఎటాక్, గుండెకు సంబంధిన వ్యాధులు.

  • కిడ్నీ ఫెయిల్ అవ్వడం.
  • కంటి చూపు తగ్గడం.
  • పెరిఫెరల్ డిసీజ్ వచ్చే అవకాశాలు అధిమవ్వడం.

లో బ్లడ్ పెజర్ కి గల కారణాలు

డీ హైడ్రేషన్, డయేరియా, లేదా వాంతులు అయినప్పుడు శరీరంలో నీరు పూర్తిగా తగ్గినప్పుడు ఆ సమయంలో పేషెంట్ ఎప్పటికప్పుడు పండ్ల రసాలు లేదా ఏదో రూపంలో నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి, అలా జరగనప్పుడు లో బి.పి. వస్తుంది.

లో బి.పి. వల్ల శరీరానికి జరిగే నష్టాలు

  • రక్తప్రసరణ తగ్గి గుండె బలహీనమవుతుంది.

  • సిక్ సైనస్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

  • ఏవైనా ఇతర చికిత్సలకోసం వాడే మందులు విషమించే అవకాశాలు ఎక్కువ.

  • రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువ.

ఆరోగ్యం వరం లాంటిది, అలాగని మన చేతుల్లో లేనిది కాదు, తీసుకునే ఆహారం పట్ల నిబద్ధత ఉండి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే చాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు