ముఖ్యంగా కుర్చీని అంటిపెట్టుకుని పనిచేసేవారు కనీసం గంటకోసారైనా ఓ పది నిమిషాలు అలా అటూఇటూ నడవడం చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
ఇక బాగా లావుగా ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ఇక ఆహారపదార్థాల విషయానికి వస్తే... ఉప్పు, కారం, నూనె మోతాదులను తగ్గించుకోవడం మంచిది.
మాంసాహారం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లున్నవారు వెంటనే వాటికి దూరంగా ఉండాలి.
క్యాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. మంచినీళ్లు సరిపడినన్ని తాగుతుండాలి.
కొన్ని కాలి నొప్పులకు కారణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. మంచి ఆహార పదార్థాలు, పండ్ల రసాలు తీసుకోవాలి. బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిని తీసుకోవాలి.