మనం తీసుకునే ఆహారం నుంచే అధికమోతాదులో కొలస్ట్రాల్ మన శరీరంలో చేరుతుంది. అధిక కొలస్ట్రాల్ ఎన్నో అనారోగ్య సమస్యలకి కారణం అవుతుంది కాబట్టి వెంటనే దానిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి.

అందుకు ముందుగా చేయాల్సింది ప్రతిరోజూ నలభై గ్రాముల వరకు నట్స్ తీసుకోవటం మొదలుపెట్టాలి. ఎందుకంటే నట్స్ లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే మేనోశాచురేటేడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి, వీటిని రోజు తీసుకుంటే ఐదు వారాలలో పదిశాతం దాకా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

 

అలాగే పీచు పదార్థాలు కూడా కొవ్వును కరిగించేందుకు తోడ్పడతాయట. ఇలా మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోగలిగితే చాలు. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవటం పెద్ద సమస్య కాదు.