పని ఒత్తిడి స్త్రీలని గుండె జబ్బులకు దగ్గర చేస్తుందని చెప్పుకుంటున్నాం కదా! ఇందుకు పరిష్కారం ఏంటంటే, నిపుణులు ఇలా చెబుతున్నారు. మొదటిగా ఉద్యోగస్తులైన స్త్రీలు టైం మానేజ్మెంట్ పై శ్రద్ధ పెట్టడం అత్యవసరం అటు అలాగే ఇంటి పనులలో ఇతర కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవటం వారి పని భారాన్ని తగ్గిస్తుంది కాబట్టి, అందుకు ఏ మాత్రం సంకోచించకూడదని కూడా చెబుతున్నారు.
అలాగే ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు ఒత్తిడికి దూరంగా ఉంచే వ్యాయామాల వంటి వాటిని అశ్రద్ధ చేయకూడదని సూచిస్తున్నారు. ఆరోగ్యకర ఆహరం అతి ముఖ్యమని కూడా చెబుతున్నారు. ఇలా పెరిగే పని భారం ఒత్తిడిని కలిగించకుండా చూసుకుంటే "మీ గుండె పదికాలాలు పదిలం" అని కూడా చెబుతున్నారు పరిశోదకులు.
-రమ