అసలైన బనారసీ పట్టును ఇలా గుర్తించండి..!

 

 

పట్టు చీరలు భారతీయ కళకు కాణాచి.  ఇక పట్టు చీరలు కట్టుకున్నమగువలను చూస్తే  సాక్షాత్తూ ఆ దేవతే దిగి వచ్చిందేమో అనిపిస్తుంది.  మగువల వల్ల చీరకు అందమా.. చీర వల్ల మగువల అందం రెట్టింపైందా అనేది తెల్చలేని సందిగ్ధం కూడా ఏర్పడుతుంది. భారతదేశంలో చాలా రకాల పట్టుచీరలు ఉన్నాయి.  ప్రాంతాన్ని బట్టి పలు రకాల పట్టులు పేరొందాయి.  వాటిలో బనారసి సిల్క్ చీర కూడా ఒకటి.   బనారసి సిల్క్ చీరకు దానిదైన ప్రత్యేకత ఉంది. అయితే స్వచ్చమైన బనారసి పట్టు అంత ఈజీగా దొరకవు. చాలా చోట్ల బనారసి పేరుతో మోసాలు జరుగుతుంటాయి.  నిజమైన బనారసి పట్టు చీరల ఫాబ్రిక్, డిజైన్, రంగు అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి.  నిజమైన బనారసి పట్టును ఎలా గుర్తించవచ్చో తెలుసుకుంటే ఈ రకమైన పట్టు చీర కొనేటప్పుడు మోసపోకుండా ఉంటారు.

మెరుపు..

బనారసి సిల్క్ చీరలను కొనేటప్పుడు దాని మెరుపు మీద దృష్టి పెట్టాలి్.  కొనుగోలు దారులు నకిలీ చీరలు చూపించి ప్రజలను సులువుగా మోసం చేస్తారు.  అందుకే బనారసి చీరలు కొనేటప్పుడు చీరల మెరుపు మీద దృష్టి పెట్టాలి.  బనారసి సిల్క్ చీరలు  చాలా మృదువుగా ఉంటాయి.


అంచు..

బనారసి సిల్క్ చీరల అంచు దారం వదులుగా ఉంటుంది.  ఈ చీరను చేతితో నేస్తారు.  దీని వల్ల అంచు దారం వదులుగా ఉంటుంది.  అదే సమయంలో నకిలీ చీరలు అయితే యంత్రం సహాయంతో నేస్తారు.  ఈ మెషీన్ తో నేసే చీరల అంచు దారాలు వదులుగా ఉండవు.  ఈ అంచును చూసి అసలు చీర, నకిలీ చీర మద్య తేజా కనుక్కోవచ్చు.

ధర..


బనారసి సిల్క్ చీరలను ధరతో పోల్చి కూడా కనుక్కోవచ్చు.  ఈ చీరలు ఖరీదైనవి.  దాదాపు 10 నుండి 12వేల రూపాయల ధర ఉంటాయి.  ఇంతకంటే తక్కువ ధరకు ఈ చీరలను ఏ దుకాణంలో అయినా అమ్ముతుంటే అవి నకిలీ చీరలని తెలుసుకోవచ్చు.  అలాంటి చీరలు కొనకూడదు.

దారం..

అసలైన బనారసి పట్టు  చీరను కనుక్కోవడానికి మరొక చిట్కా ఉంది.  అసలైన బనారసి పట్టు దారం కాల్చిన వెంటనే కాలిపోతుంది. చేతికి మసి అంటుతుంది.  అదే నకిలీ బనారసి పట్టు అయితే ప్లాస్టిక్ దారాలతో తయారవుతుంది.  దీని దారం కాల్చినప్పుడు చేతికి అతుక్కుంటుంది.

నమ్మకం..

బనారసి సిల్క్ చీరలను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ కొనకూడదు.  నమ్మకమైన  దుకాణాదారుల దగ్గర.. చాలా వరకు నేత పని చేసే వారి దగ్గర నేరుగా కొనడం మంచిది.


                                        *రూపశ్రీ.