సేఫ్టీ పిన్ వల్ల చీర లేదా దుపట్టా చిరిగిపోతోందా...ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే..!

 

 

సేఫ్టీ పిన్.. ప్రతి అమ్మాయికి చాలా అవసరమైన వస్తువు. చీరలు,  డ్రస్ కు వేసుకునే చున్నీలను  జారిపోకుండా ఉండటం కోసం సేఫ్టీ పిన్ లను వాడతారు.  మధ్యతరగతి, దిగువ తరగతి మహిళల మంగళసూత్రానికి,  గాజులకు ఈ సేఫ్టీ పిన్స్ తప్పనిసరిగా ఉండటం చూడవచ్చు.  అయితే సేఫ్టీ పిన్ లను చీరలు కట్టుకున్నప్పుడు,  దుప్పట్టా వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ ను వాడి ఆ తరువాత మనసు చిన్నబుచ్చుకునే వారు చాలామంది ఉంటారు.  కారణం..  ఈ సేఫ్టీ పిన్ లు పెట్టుకున్నప్పుడు డ్రస్ లేదా చీర క్లాత్ కాస్త చిరిగిపోవడం.  సేఫ్టీ పిన్ వినియోగం వల్ల మంచి మంచి దుస్తులు రంధ్రాలు పడుతుంటాయి.  ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఈజీ ట్రిక్స్ పాటించాలి.

ఈ సమయంలోనే ఎక్కువ..

చాలా సార్లు హడావిడిగా చీర కట్టుకున్నప్పుడు,  డ్రెస్ వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు సరిగా పెట్టకుండా ఆవేశంతో పిన్ ను గుచ్చేస్తుంటారు. దీని వల్ల అవి చీరలోనూ, చున్నీలలోనూ ఇరుక్కుపోయి అవి సులభంగా బయటకు రాలేక.. దుస్తులకు నష్టం చేకూరుస్తాయి. దీని వల్ల చాలా వరకు కొత్త చీరలు, డ్రస్సులు బలి అయిపోతుంటాయి.

బటన్స్..

చీర లేదా దుపట్టాను పిన్ చేయడానికి ముందు సేఫ్టీ పిన్ కు రంగురంగుల బటన్ లను అటాచ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చీర చిరిగిపోదు.  బట్ట సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. సేఫ్టీ పిన్ ను తిరిగి తీసేయడం కూడా సులువుగా ఉంటుంది.

స్టిక్కర్..

సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు స్టిక్కర్ కూడా ఉపయోగించవచ్చు.  స్టిక్కర్ ఉపయోగించి సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల దాన్ని తిరిగి తీయడం సులువు అవుతుంది. అలాగే క్లాత్ చిరిగిపోకుండా కాపాడుకోవచ్చు.

పాలిథిన్..

చీరకు కానీ,  దుపట్టాకు కానీ సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు దానికి పాలిథిన్ కవర్ లేదా కాగితాన్ని అతికించవచ్చు.  దీని వల్ల క్లాత్ చిరిగిపోకుండా ఉంటుంది.  సేఫ్టీ పిన్ పెట్టుకోవడం,  తిరిగి తీయడం కూడా సులువే.

బీడ్స్..

సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు చీరకు కానీ,  దుపట్టా కు కానీ నష్టం జరగకూడదు అంటే సేఫ్టీ పిన్ కు బీడ్స్ ఎక్కించాలి.  ఇవి కూడా చాలా  అట్రాక్షన్ గా ఉండే ముత్యాలు,  రంగు రంగుల పూసలను సేఫ్టీ పిన్ కు ఎక్కించి వాడటం వల్ల చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది.

టేప్..

సేఫ్టీ పిన్ ల మధ్య టేప్ ఉపయోగించడం వల్ల సేఫ్టీ పిన్ వల్ల చీరలకు,  దుపట్టాలకు నష్టం జరగదు. టేప్ వల్ల క్లాత్ లో సేఫ్టీ పిన్ లు ఇరుక్కోకుండా ఉంటాయి.


                                                     *రూపశ్రీ.