ఆరోగ్యం కోసం చిరుధాన్యాలపై అవగాహన

కొర్రలు, సామలు, అరికలు, బరిగలు, ఉదరు, రాగులు, జొన్నలు, సజ్జలు... ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా? వీటి గురించి అందరు మరిచిపోయారు కదూ. ఇప్పుడంతా పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీంలు, పానిపురీలు ఇలాంటివి అంటే అందరికి తెలుసు. కాలం మారుతుంది కాబట్టి కాలంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. కానీ ఈ మార్పుల వలన ప్రజలకు ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి.

ప్రస్తుత ఆహార తీరు కారణంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులు అధికంగా సంక్రమిస్తున్నాయి. చిరుధాన్యాలు తీసుకోకపోవడం వల్లే మధుమేహం తదితర వ్యాధులు పెరుగుతున్నాయి అని శాస్త్రవేతలు చెపుతున్నారు. పిల్లలకు, పెద్దలకు రాగితో కూడిన ఆహారాన్ని అందించడం వలన శరీర పెరుగుదల సరిగ్గా ఉంటుంది. చిరుధాన్యాలు తినడం ద్వారా అసలు మధుమేహం వ్యాధి దరిచేరే అవకాశం ఉండదు. మహిళలు, చిన్నారుల్లో ఐరన్ తగ్గిపోవడం కారణంగా అనీమియా అనే వ్యాధి బారిన పడుతున్నారు. చిరుధాన్యాలు తీసుకోవడం వలన మన శరీరంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థతులనైన తట్టుకొని, ఉత్పత్తి సాధించే శక్తి చిరుధాన్యాలకు ఉంది.

 

ఈ నేపధ్యంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించేందుకు... ఆచార్య ఎన్.జి.రంగ విశ్వవిద్యాలయం నేతృత్వంలో గృహ విజ్ఞాన కళాశాల, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న చిరుధాన్యాల ఉత్సవం(Millet Fest) 2014 జనవరి 25,26 తేదిలలో, గుంట గ్రౌండ్స్ , గుంటూరు నందు జరుగును. మరిన్ని వివరాలకై www.milletfest.org వెబ్ సైట్ ను సంప్రదించగలరు.