గ్లోయింగ్ ఫేస్ పాక్స్
ముఖం అందంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్ ప్యాక్‌లు తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో చూడండి.
జిడ్డు చర్మం :
బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి, కచ్చుర్ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో మిక్స్ చేసి ముఖానికి అపె్లై చేయాలి. 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు పోతుంది, మొటిమలు తగ్గుతాయి.
పొడి చర్మం :
గులాబి, చందనం, అల్మండ్ పౌడర్‌లు, పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మెల్లగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంలో పొడితనం పోయి, ముఖం కాంతివంతమవుతుంది.
బొప్పాయి, కచ్చుర్ సుగంధీ పౌడర్, ముల్తాన్ మట్టి, ఛాయపసుపు, గులాబీ పౌడర్‌లను రోజ్‌వాటర్‌లో వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20నిమిషాల తర్వాత కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అయితే ఇలా వారానికి మూడు సార్లు తప్పనిసరిగా చేస్తేనే ఫలితం ఉంటుంది.
కళ్ల కింద నలుపు:
గులాబీరేకులపొడి, బొప్పాయి, పుదీనా పొడుల్లో, రెండు చుక్కల చందనం నూనె, అలోవీరా జెల్‌ని కలిపి కంటి చుట్టూ రాయాలి. ఓ పదినిమిషాల పాటు మెల్లిగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి..
రోజ్‌వాటర్‌లో చందనం, గులాబి, ఛాయపసుపు, దోసకాయ రసం, బొప్పాయి పొడి, ముల్తాన్ మట్టి కలిపి ముఖానికి రాయాలి. అరగంట ఆగి, గోరు నీటితో కడిగేయాలి.