ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలంటే
ఆడవాళ్ళ అందాలల్లో బాగా ఆకట్టుకునేవి కళ్ళు మాత్రమే ! ఆ కళ్ళతో ఒక చూపు చూస్తే చాలు మగవాళ్ళు మనస్సు పారేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం అబద్దం లేని నిజం. అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. కొన్నికొన్ని చోట్లా " నీ కళ్ళు చాలా బాగున్నాయి " అనే డైలాగ్స్ కాని మాటలు కాని అక్కడక్కడ వినబడుతూ ఉంటాయి. మరి అంతగా ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలంటే తేలిగ్గా ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
* ప్రతిరోజూ సరిపోయేంతగా నిద్రపోవాలి. అలా నిద్రపోవడం వల్ల మీ కళ్ళు తాజాగా కనబడుతుంటాయి.
* పాలమీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే, కళ్ళ చుట్టూ ఉండే మడతలు పోయి మరింత ఆకర్షణగా కనబడుతుతాయి.
* కీరదోసకయలను తినడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాదు, ఆ కీరదోసకాయలను చక్రల్లాగా కోసుకొని కళ్ళ మీద పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కళ్ళు తాజాగా మెరుస్తుంటాయి.
* కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల కళ్ళుకి ఇన్ పెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
* ప్రతిరోజూ ఉప్పు నీటితో కళ్ళను కడుక్కోవాలి. అలా ఉప్పు నీటితో కడగడం వల్ల కళ్ళు మెరుస్తాయి.
సో అమ్మాయిలు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎప్పటికప్పుడు పాటిస్తే ఆకర్షించే కళ్ళు మీ సొంతమయినట్టే !