మహిళల మానసిక ఆరోగ్యం మీద ఫ్యాషన్ ప్రభావం ఉంటుందా!

 

ఫ్యాషన్ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేది,  ఒక వ్యక్తి రూపాన్ని మార్చేసేది,  ఒక వ్యక్తిని అందంగా చూపెట్టేది.  ముఖ్యంగా అందంగా కనబడాలనే తపనతోనూ,  అందరిలో తాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటారు.  అయితే ఫ్యాషన్ కు మానసిక ఆరోగ్యానికి మధ్య చాలా సంబంధం ఉందని అంటున్నారు మానసిక  నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

మానసిక ఆరోగ్యంపై ఫ్యాషన్ ప్రభావం..

మంచి బట్టలు..

మంచి బట్టలు వేసుకోవడం ఫ్యాషన్ లో భాగమే.. ఒక మనిషిని హుందాగా,  పది మందిలో గౌరవంగా నిలబెట్టడంలో వస్త్రధారణ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల అందరిలో  చాలా సౌకర్యవంతంగా ఉండగలుగుతారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యాషన్ అనేది మనిషి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మనిషి మానసిక ఆరగ్యం పైన సానుకూల ప్రభావం చూపిస్తుంది.

 ఒంటరితనం..

ఫ్యాషన్ అనేది  ఏ ఒక్కరో ఫాలో అయ్యే విషయం కాదు. ఫ్యాషన్ ను కొందరు ఉమ్మడిగా ఫాలో అవుతారు. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా ఫ్యాషన్ షోలు,  ట్రెడిషన్,  వెస్ట్రన్,  ఫారిన్ అంటూ వివిధ రకాల కల్చర్ కు సంబంధించిన దుస్తులను అందరూ ఉమ్మడిగా ధరిస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు.  ఇది వ్యక్తిని ఒంటరితనం నుండి బయటకు తీసుకు వస్తుంది.  అంటే ఫ్యాషన్ అనేది మనిషిని సమాజంలో భాగం చేస్తుంది.

ప్రతికూలత కూడా..

ఫ్యాషన్ అనేది కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ.. కొందరిని మానసిక ఒత్తిడిలోకి కూడా నెట్టుతుంది. ముఖ్యంగా ఫ్యాషన్ లో భాగంగా మానసిక ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇతరులతో పోల్చుకోవడం,  ఇతరుల కంటే తాము ఫ్యాషన్ గా లేమని అనుకోవడం,  తమను తాము తక్కువ చేసుకోవడం.  ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచినా అది వ్యక్తి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.  ఖరీదైన దుస్తులు,  ఖరీదైన ఆభరణాలు,  ఖరీదైన హ్యాండ్ బ్యాగులు,  వాచ్ లు, చెప్పులు.. ముఖ్యంగా మ్యాచింగ్ వేర్ అనేది ఫ్యాషన్ లో భాగం కాబట్టి చాలా ఖర్చు అవుతుంది.  ఇది ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది.  ఇది క్రమంగా ఒత్తిడి,  ఆందోళనకు దారితీస్తుంది. ఫ్యాషన్ ఇప్పట్లో చాలా వేగంగా మారిపోతుండటం వల్ల ఇది ఎక్కువగా ఉంది.


ఫ్యాషన్ అనేది వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెట్టేదే.. కానీ ఈ ఫ్యాషన్ ఫాలో అయ్యే పది మందిలో ఏ ఒక్కరో తగినంత ఫ్యాషన్ గా లేకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా మిగిలిన వ్యక్తుల నుండి వివక్ష ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఫ్యాషన్ గా లేకపోవడాన్ని నేటి కాలంలో అనాగరికంగా భావించడం కూడా దీనికి కారణం.

ఫ్యాషన్ లో పోకడలు ఏవైనా  సమాజ ఆమోద యోగ్యంగా ఉన్నంతవరకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ సమాజానికి వ్యతిరేకంగా ఉన్నా,  సమాజ కట్టుబాట్లకు భిన్నంగా ఉన్నా ఆ వ్యక్తిని దూరం ఉంచినట్టు,  ఆ వ్యక్తిని ఒంటరిగా ఉంచినట్టు చేస్తారు.

పై కారణాలు అన్నీ గమనిస్తే.. ఫ్యాషన్ అనేది మనిషిని ఉన్నతంగానూ నిలబెట్టగలదు.. అదే విధంగా సమాజం నుండి వేరు చేసి దోషిగానూ నిలబెట్టగలదు.  మానసికంగా ఆత్మవిశ్వాసంగా ఉంచగలదు,  కృంగదీయగలదు కూడా.  వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాషన్ ను ఫాలో అవ్వడం మంచిది.


                                       *రూపశ్రీ.