ఆడవారి వార్డ్ రోబ్ అధిరిపోవాలంటే ఈ ఐదు చిట్కాలు చాలా ముఖ్యం..
 


 బీరువా లేదా వార్డ్ రోబ్ నిండా మంచి మంచి దుస్తులు ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఎంత మంచి దుస్తులు కొన్నా ఏదో వెలితి మహిళలను వెంటాడుతుంటుంది. వార్డ్ రోబ్ తీయగానే ఎందుకో అంతగా ఆకర్షించని దుస్తులు చాలావరకు వెక్కిరిస్తున్నట్టు ఉంటాయి. కొనేటప్పుడు ఉన్నంత హుషారు ఆ తరువాత చాలావరకు ఉండదు. కానీ తీసేద్దామని అనుకునేటప్పుడు మాత్రం ఆ దుస్తులకోసం పెట్టిన ఖర్చు గుర్తుకొస్తుంది. ఈ కారణంగా మహిళల వార్డ్ రోబ్ లలో ధరించని దుస్తులు ఎక్కువ ఉంటాయి. కేవలం ఐదే ఐదు చిట్కాలు పాటించడం వల్ల దుస్తుల విషయంలో చాలా జాగ్రత్త పడవచ్చు. కేవలం మంచి దుస్తులు మాత్రమే వార్డ్ రోబ్ లో ఉంచేలా చేయడమే కాదు, డబ్బు కూడా ఆదా చేయవచ్చు. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

బాగా సరిపోయే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఎప్పుడూ ముఖ్యం.  శరీర సౌష్టవానికి తగిన షేప్,  శరీరానికి నప్పే రంగుల కోసం ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతారు. కానీ తీరా కొన్నాక బాలేదని అనిపిస్తుంది.ఒకటి రెండు అలాంటివి ఉన్నా పర్లేదు కానీ ఎక్కవ మొత్తం వార్డ్ రోబ్ లో ఉంటే మాత్రం కష్టమే.. ఇలాంటివి అరికట్టడానికే ఈ సింపుల్ టిప్స్..

రెగులర్స్ పై సేవింగ్స్..

కొన్ని దుస్తులకు  అధిక ఖర్చు అవసరం లేదు. రోజువారి ధరించే టీ షర్డ్ లు, టాప్ లు, షార్ట్ లు, ప్యాంట్ లు తక్కువ దగ్గరకు దగ్గరలో ఉన్న దుకాణాలలో లభిస్తాయి. ఇలాంటి దుస్తులకు బ్రాండెడ్ అనే ట్యాగ్ కోసం వెంపర్లాడకండి. ఇవి రోజూ ధరిస్తుంటారు కాబట్టి తక్కువ ధరవే బెస్ట్.  పైపెచ్చు తక్కువ ధరకు లభించే వీటిని ఎక్కువ మొత్తం ఒకేసారి తీసుకుంటే దుకాణాదారులు  కాస్త డిస్కౌంట్ కూడా ఇస్తారు. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది, ఇంకోవైపు  సౌకర్యవంతంగా ఉన్నవి కొన్నట్టు ఉంటుంది.

 వార్డ్ రోబ్  శుభ్రం చేయాలి..

 ఇది దాదాపు అందరు మహిళలకు ఏదో ఒక సమయంలో ప్రయోజనం చేకూర్చే  చిట్కా.  ఎప్పుడూ ధరించని దుస్తులను బయటకు తీసేయాలి.  ధరించకూడదని పదే పదే అవాయిడ్ చేస్తున్న దుస్తులు, పాతగైపోయిన వస్త్రాలు తొలగించడం వల్ల వార్డ్ రోబ్ ఇష్టమైన వాటితో వెలిగిపోతుంజి. నచ్చని దుస్తులను   స్వచ్ఛంద సంస్థలకు  విరాళంగా ఇవ్వచ్చు. దీనివల్ల ఒకింత సంతృప్తి కూడా లభిస్తుంది.

క్లాసిక్‌ దుస్తులు ఉండాలి..

ఎక్కువ కాలం  వార్డ్‌రోబ్‌లో తళుక్కున మెరవాలంటే అవి ఖచ్చితంగా క్లాసిక్ దుస్తులు అయి ఉండాలి. ఎందుకంటే క్లాసిక్ దుస్తులకంటే  విలువైనవి ఏవీ లేవు. వాటిలో కొద్దిగా నలుపు రంగు దుస్తులు ,  తెల్లటి చొక్కా, బ్లేజర్, ఒక జత  జీన్స్, నలుపు ప్యాంటు, స్మార్ట్ ఉన్ని కోటు, న్యూట్రల్ కార్డిగాన్,  ర్యాప్ డ్రెస్ మొదలైనవి ఉంచవచ్చు. ఇవి  సౌకర్యవంతంగా కొంచెం ఎక్కువ ఖర్చు చేయగల దుస్తులు. మరో మాటలో చెప్పాలంటే, కొంచెం ఖరీదైన శీతాకాలపు కోటు మీకు అందంగా సరిపోతుంటే దానిని కొనడం ఆపుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవి   చాలా సంవత్సరాలు ధరించే అవకాశం ఉంది.

ట్రెండింగ్..

 ప్రతి సీజన్ దానితో పాటు ట్రెండింగ్ దుస్తులను తీసుకువస్తుంది. ఇటీవలి సీజన్‌లలో శిల్పకళతో కూడిన భుజాలు,  గ్లాడియేటర్ హీల్స్ ఉన్న టాప్‌ల నుండి సీక్విన్స్,  స్టడ్‌ల వరకు ప్రతిదీ ఉంటోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే చందాన పాత తరం ఫ్యాషన్ మళ్లీ కొత్త సొబగులతో వచ్చి అలరిస్తుంది.  కాబట్టి  ట్రెండింగ్ దుస్తుల కోసం  ఖర్చు పెట్టడంలో  అతిగా ఉండకూడదు.

కంఫర్ట్ ముఖ్యం..

ఏ దుస్తులు అయినా కంఫర్ట్ గా లేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దుస్తులలో అందమంతా కంఫర్ట్ గా ఉండటంలోనే సగానికి పైగా ఎస్సెట్ అవుతుంది. శరీర ఆకృతి, శరీరంలో భాగాలకు అనుగుణంగా తగిన దుస్తులు ఎంచుకోవడం వల్ల దుస్తులు, శరీరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపిస్తాయి. అందుకే శరీరాకృతికి తగిన దుస్తులు ఎంచుకుంటే అవి ఎప్పుడు ధరించాలన్నా ఇష్టంగా ఉంటుంది.


 
                                                                   *నిశ్శబ్ద