ఇంట్లోనే ఫేషియల్

Home made facial Masks

పది మందిలో ఉన్న మనకంటూ ఒక ప్రత్యేకత వచ్చేది అందం వల్లే అనడంలో అతిశయోక్తి లేదు, ఇంట్లోనైనా, ఆఫీసు లోనైనా, ఫంక్షన్స్ లోనైనా ఆకర్షణీయంగా కనబడటానికి ఎవరు ఇష్టపడరు..? అందుకే బ్యూటీ పార్లర్ లకి చెప్పలేనంత డిమాండ్. ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్న బ్యూటీ పార్లర్ ల ప్రయోజనాలు బాగానే ఉన్నా , సమయం లేక బ్యూటీ పార్లర్ లకు వెళ్ళలేని వారు కొందరైతే , అంతంత ఖర్చు అవసరమా అని మానుకునే వారు కొంతమంది..

అలాంటి వారికోసమే ఈ సింపుల్ ఫేషియల్ ప్యాకేజేస్ , మరెందుకు ఆలస్యం, మీరు ఏ ఫేషియల్ చేయించుకోవాలను కుంటున్నారో మీరే ఎంచుకుని , మీరే తయారు చేసుకుని, మీకు మీరే బ్యూటీషియన్ అయిపొండి.

ఆయిలీ స్కిన్ ఉన్నవారికి - సిట్రస్ మాస్క్


కావలసినవి:

½ వంతు పంపర పనస (Grapefruit),

½ వంతు నిమ్మ రసం,

½ వంతు యాపిల్ పండు,

1- 2 గుడ్డు లోని తెల్లసొన ,

30-40 ద్రాక్ష పళ్ళు

వీటన్నింటిని బ్లెండ్ చేసి మొహానికి పెట్టుకుని 15 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మొహం లో జిడ్డు తగ్గుతుంది.

డీ హైడ్రేటెడ్ స్కిన్ ఉన్నవారికి - ఫ్రూట్ మాస్క్

 

కావలసినవి:

ఒక కప్పు నిండా స్ట్రా బెర్రీస్, పీచెస్, నిమ్మరసం , మరియు అరటిపండు.

2-3 స్పూన్స్ డబుల్ క్రీం

3 స్పూన్స్ వెన్న

1 స్పూన్ బెల్లం

4 స్పూన్ ల ఓట్ మీల్ పౌడర్

కలిపి బ్లెండ్ చేసి 15 నిమిషాలు మొహానికి రాసుకుని గోరువెచ్చటి తో నీటితో కడగండి.  

తేనె మాస్క్

కావలసినవి: 

1 1/2 స్పూన్ తేనె

1 గుడ్డులోని తెల్లసొన

2 స్పూన్ ల గ్లిసరిన్

1/3 కప్పు శనగపిండి


వీటన్నింటినీ కలిపితే చిక్కటి పేస్ట్ లా తయారవుతుంది . దాన్ని 15 నిమిషాల పాటు మొహానికి పెట్టుకుని గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఈ మిశ్రమం చర్మాన్ని మాయిస్చర్ చేసి స్కిన్ ని టైటనింగ్ చేసి చర్మం స్మూత్ గా సాఫ్ట్ గా అయ్యేలా చేస్తుంది
.  

గుడ్డు తో ఫేషియల్స్

 

ఎగ్ మాస్క్ 1

కావలసినవి:

1 గుడ్డులోని తెల్లసొన
గుడ్డు లోని తెల్లసొనను 15 నిమిషాల పాటు మొహానికి రాసుకుని రిలాక్స్ అయితే స్మూత్ గా తయారవుతుంది.

ఎగ్ మాస్క్ 2

కావలసినవి:

గుడ్డులోని పసుపుసొన

గుడ్డులోని పసుపు సొనను 15 నిమిషాల పాటు మొహానికి రాసుకుని గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మం నిగనిగలాడుతుంది. గుడ్డు లోని పసుపు సొన లో ఉండే యాంటీ- ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుడ్డు మరియు తేనె స్పెషల్

కావలసినవి:

గుడ్డులోని పసుపు సొన

1 స్పూన్ తేనె

1 స్పూన్ విటమిన్ ఈ ఆయిల్
1
స్పూన్ బాదం నూనె

వీటన్నింటిని బాగా కలిపి 15 నిమిషాలు మొహానికి పట్టించి కడిగేయాలి. ఈ మాస్క్ అన్ని రకాల చర్మం వారికి బాగా ఉపకరిస్తుంది. ఈ మిశ్రమాన్ని కనీసం వారానికొకసారైనా మొహానికి పట్టిస్తే గుడ్డులోని పసుపు సొనలో ఉన్న యాంటీ యాక్సిడెంట్స్ చ ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

పెరుగు మాస్క్

కావలసినవి:

పెరుగు

పెరుగును మొహానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడగాలి. డ్రై స్కిన్ ఉన్నవారు రోజుకు ఒకసారి అప్లై చేసుకుంటే చర్మం కాంతి లీనుతుంది.

టమాట మాస్క్
కావలసినవి :
1/2
టమాట ( టమాట తోలు, గింజలు లేకుండా చేసుకోవాలి)
2
స్పూన్ పెరుగు
1
స్పూన్ సన్నగా తరిగిన కీరదోస

3-4 స్పూన్ ల ఓట్ మీల్ పౌడర్

3 పుదీనా ఆకులు

వీటన్నింటినీ కలిపి మొహానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.
ఈ మాస్క్ ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. టమాట లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. పెరుగు చర్మం లో తేమను కాపాడుతుంది.

సులువైన ఫ్రూటీ ఫేషియల్స్


స్ట్రా బెర్రీ

స్ట్రా బెర్రీలను క్రష్ చేసి మొహానికి రాసుకుని 2-3 నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

స్ట్రా బెర్రీ లో ఉండే విటమిన్ సి, చర్మాన్ని తేజోవంతం చేస్తుంది.

బొప్పాయి

బొప్పాయి గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. బొప్పాయి లో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మానికి బాగా ఉపకరిస్తుంది.

పుచ్చకాయ


పుచ్చకాయ గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచితే మొహంలోని మలినాలన్నీ శుభ్రం అవుతాయి.