టమాట ఫేషియల్స్

Facials with Tomato

టమాటలో చర్మ సంరక్షణకు కావలసిన అన్ని పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగించడమే కాదు, యాంటీ ఆక్సిడెంట్ లా కూడా పని చేస్తుంది. చర్మంలోని బ్లాక్ హెడ్స్ ని తొలగించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.. టమాటా లతో ఇంట్లోనె తయారు చేసుకోగలిగే ఫేస్ మాస్క్ లు .

చర్మాన్ని కాంతి వంతం చేసే టమాటా ఫేషియల్స్


టమాట : టమాటా ను పేస్ట్ లా చేసి లేదా ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేస్తే చర్మంలో దాగి ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి.

టమాటా రసం మరియు పెరుగు

రెండు స్పూన్ ల టమాటా రసాన్ని తీసుకుని 4 స్పూన్ ల పెరుగులో కలిపి మొహానికి పట్టించి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం కాంతి లీనుతుంది .

టమాటా జ్యూస్ మరియు తేనె

తేనె మరియు టమాట రసాన్ని సమపాళ్ళలో కలిపి ముఖం నుండి మెడ వరకు రాసి 15 నిమిషాల వరకు ఉంచి కడిగితే చర్మం నిగనిగలాడుతుంది.

టమాటా మరియు ఓట్ మీల్


ఒక ఎర్రటి టమాటా తీసుకుని చిన్నగా తరిగి అందులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ బ్లైండ్ చేయాలి, అప్పుడది పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్ట్ ని మొహానికి పట్టించి 10 నిమిషాల వరకు ఉంచి ఆ తరవాత మృదువుగా రబ్ చేసి, గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ తో మొహాన్ని తుడవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

టమాటా దోసకాయ

ఒక టమాటా, సగం కుకుంబర్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం, సగం టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ ల కమ్మీల్ పౌడర్ వేసి కలిపి పేస్ట్ లా తయారు చేసి కాళ్ళ చుట్టూ రాసుకుంటే కాళ్ళ చుట్టూ పీరుకున్న నల్లటి చారలు తగ్గు ముఖం పడతాయి.