గోళ్ళు కావు గోల్డ్ తునకలు
నైల్ పాలిష్ ను ఇష్టపడని స్త్రీలు చాలా తక్కువ. నైల్ పాలిష్ కోసం ప్రతి నెలా వందలాది రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. కొందరు వారానికోసారి గోళ్ళకు రంగు వేసుకుంటే, మరికొందరు రోజూ వేసుకుంటారు. ఏదో ఒక రంగు కాకుండా తమ దుస్తులకు మాచ్ అయ్యే రంగు వేసుకోవడం ఫాషన్.
ఒకప్పుడు సినిమావాళ్ళు, సెలెబ్రిటీలు మాత్రమే ఫాషన్ విషయంలో శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇప్పుడలా కాదు. అందరికీ అందం మీద శ్రద్ధాసక్తులు పెరిగాయి. చెప్పులు మొదలు హెయిర్ బాండ్ వరకూ ఫాషన్ ట్రెండ్స్ ను పాటిస్తున్నారు. నఖశిఖపర్యంతం అందంగా, ఫాషనబుల్ గా ఉండాలని తపిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. చక్కగా, స్టైలిష్ గా నైల్ పాలిష్ వేసుకుని, అవి గోళ్ళు కావు గోల్డ్ తునకలు అనిపించేలా చేస్తున్నారు.
మరి గోళ్ళ రంగు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం
. ముందు గోళ్ళలో ఏమాత్రం మురికి చేరకుండా చూసుకోవాలి
. నైల్ కటర్ సాయంతో గోళ్ళకు చక్కటి ఆకృతిని ఇవ్వాలి
. నైల్ పాలిష్ లో అసంఖ్యాకమైన రంగులు దొరుకుతాయి
. అయితే వాటిల్లో మనకు నప్పే షేడ్స్ ను ఎన్నుకోవాలి
. ఉన్న రంగును మార్చి మరో రంగును వేసుకోదలచినప్పుడు నైల్ పాలిష్ రిమూవర్ తో తుడిపి కొత్తది వేయాలి. లేకుంటే షేడ్ మారిపోతుంది
. మంచి క్వాలిటీ నైల్ పాలిష్ వాడాలి. లేకుంటే గోళ్ళు పాడవుతాయి. ఎక్కువరోజులు ఉంటుంది కూడా
. ఒక కోటింగ్ ఆరిన తర్వాత మాత్రమే మరో కోటింగ్ వేయాలి
. నైల్ పాలిష్ ను రెఫ్రిజిరేటర్లో భద్రపరచినట్లయితే ఎండిపోకుండా నిలువ ఉంటుంది.