టాప్ కోట్‌తో గోళ్ళు సేఫ్

 



మీ గోళ్ళు కొంచెం పచ్చరంగులోకి మారినట్టు అనిపిస్తున్నాయా? అయితే మీరు తరచుగా నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారని  అర్థం. తరచూ నెయిల్ పాలీష్ వేసుకుంటే కలరింగ్ ఏజెంట్ల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ అది. గోళ్ళు అలా పచ్చరంగులోకి మారకూడదంటే నేరుగా పాలిష్ వేసుకోకుండా ముందు లైట్‌గా బేస్ కోట్ వేసుకోవాలి. అలాగే ఇప్పటికే పచ్చగా మారిన గోళ్ళు తిరిగి మునుపటి అందాన్ని పొందాలంటే వారానికి ఒకసారి అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో కాస్త నిమ్మరసం  పిండి అందులో గోళ్ళు మునిగేలా ఉంచితే సరి.

-రమ