ముచ్చటగా మూడు ప్యాక్‌లు

 



జుట్టు పొడిబారినట్టు వుందీ అంటే జుట్టులో తేమ తగ్గిందని అర్థం. తేమ తగ్గిన జుట్టు చిట్లిపోతుంటుంది. రాలిపోతుంటుంది. ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే ఈ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు.

గుడ్డులో ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, కరిగే కొవ్వులు అధికంగా వుంటాయి. కాబట్టి గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి.

గుడ్డులోని తెల్లసొనలో మూడు చెమ్చాల వెనిగర్, ఒక చెమ్చా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు తిరిగి తేమ అందుతుంది. పొడిబారటం తగ్గుతుంది.

ఇక జుట్టు బాగా రాలిపోతుంటే ఈ ప్యాక్ ట్రై చేయండి.

పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తెల్లసొన వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి, ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.


కలబంద గుజ్జు ఓ నాలుగు చెమ్చాలు తీసుకుని అందులో రెండు చెమ్చాల కొబ్బరి నూనె, చెమ్చా పెరుగూ కలిపి తలకు పట్టించి - గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా జుట్టు పొడిబారటం తగ్గుతుంది. ఇక తలంటు పోసుకునే ముందురోజు వేరుశనగ నూనె, బాదం నూనె, కొబ్బరి నూనెలను సమపాళ్ళలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా వుంటుంది.


-రమ