యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్.. వారానికి రెండుసార్లు వేసుకుంటే చాలు.. యవ్వనంగా కనిపిస్తారు!

 


యవ్వనంగా ఉండాలన్నది ప్రతి అమ్మాయి కల. కానీ ఇంకా పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకనే ముసలి వారిలాగా ముడతలు, గీతలు పడిన చర్మంతో కనిపిస్తుంటారు కొందరు. దీన్ని అధిగమించడానికి మార్కెట్లో దొరికే బోలెడు ఉత్పత్తులను కూడా వాడుతుంటారు. అయితే వీటి వల్ల తాత్కాలిక ఫలితం తప్ప దీర్ఘకాలిక ఫలితం ఉండదు.  ఇందుకోసం యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ లు బాగా సహాయపడతాయి.  చర్మ సంరక్షణ నిపుణులు సూచించిన యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తుంటే చాలు.. ఏ ఫేస్ క్రీములు అవసరం లేదని.. చర్మం యవ్వనంగా కనిపిస్తుందని అంటున్నారు.  ఇంతకీ ఆ ఫేస్ మాస్క్ ఏంటో తెలుసుకుంటే..

కేవలం రెండు పదార్థాలతో..

కేవలం రెండు పదార్థాలతో ఇంట్లోనే అద్బుతమైన యాంటీ ఏజింగ్  ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చట.  దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం ఎప్పుడు హైడ్రేట్ గా ఉంటుంది.  చర్మం కాంతివంతంగా మెరుగుస్తుంది.  చర్మం రంగు మెరుగవుతుంది.  చర్మానికి తగినంత యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.  ముఖ్యంగా చర్మం చాలా స్లిమ్ గా స్మూత్ గా మారుతుంది.


ఫ్రెంచ్ గ్రీన్ క్లే.. గ్రీన్ టీ..

ఈ మధ్యకాలంలో  ఫ్రెంచ్ గ్రీన్ క్లే చాలా వైరల్ అవుతోంది.  ఆకుపచ్చ రంగులో ఉంటే ఇది ముల్తానీ మట్టిని పోలి ఉంటుంది.  దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది.  ఈ ఫేస్ మాస్క్ ఎలా చేయాలంటే..

రెండు స్పూన్ల ఫ్రెంచ్ గ్రీన్ క్లే..

ఒక స్పూన్ గ్రీన్ టీ ఆకులతో గ్రీన్ టీ తయారుచేసుకోవాలి.

ఒక చిన్న గిన్నెలో ఫ్రెంచ్ గ్రీన్ క్లే పౌడర్ వేసి అందులో గ్రీన్ టీ నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని పేస్ ప్యాక్ పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఫ్రెంచ్ గ్రీన్ క్లే టోనింగ్ తో గట్టిపడుతుంది.  ఇది చర్మం మీద ఆరిపోయే కొద్దీ చర్మ రంధ్రాలను బిగుతుగా మారుస్తుంది.  ముఖ చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా మంచి ఆకారంలోకి మారుతుంది.

ఫ్రెంచ్ గ్రీన్ క్లే ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటే చర్మం ముడుతల బారిన పడదు.  చర్మం మీద అప్పటికే ఉన్న ముడతలు, గీతలు తగ్గుతాయి. గ్రీన్ టీ లో కూడా యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి.  గ్రీన్ టీ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.  ముఖం మీద మచ్చలను తగ్గిస్తుంది.  వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ఫేస్ మాస్క్ ను వాడుతుంటే చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి.  ఒక వేళ పొడి చర్మం ఉన్నవారు అయితే ఫ్రెంచ్ గ్రీన్ క్లే లోకి గ్రీన్ టీ పాటు కొద్దిగా పాలు వేసుకోవాలి.  లేకపోతే కొంచెం తేనెను వేసుకోవచ్చు.  ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.


                                                           *రూపశ్రీ.