రోజూ ఈ ఆహారాలు తింటూ ఉంటే జుట్టు నడుము పొడవు పెరుగుతుంది..!
జుట్టు పొడవుగా పెరగాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. అబ్బాయిలు కూడా ఒత్తుగా జుట్టు పెంచుకోవాలని ట్రై చేస్తుంటారు. అలాంటిది అమ్మాయిలు ఈ విషయంలో నెగ్లెట్ గా ఉండటం అనేది జరగదు. అయితే జుట్టు పెరుగుదల ఈ కాలంలో చాలా కష్టంగా మారింది. జుట్టు వేగంగా పెరగకపోవడానికి శరీరంలో పోషకాల కొరత కూడా కారణమవుతుంది. . సాధారణంగా జుట్టు పెరుగుదలకు షాంపూలు, నూనెలు, మాత్రమే చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ శరీరంలో లోపం ఉంటే నూనెలు, షాంపూలు పెద్దగా ప్రభావం చూపవు. అందుకే ఆహారంలో పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. వెంట్రుకల పెరుగుదలకు సహాయపడే కొన్ని హెయిర్ గ్రోత్ ఫుడ్స్ తీసుకుంటే జుట్టు మందంగా మారడమే కాకుండా జుట్టు నడుము పొడవు పెరగడం పక్కా..
గుడ్లు..
గుడ్లను సూపర్ ఫుడ్స్ అంటారు. గుడ్లు తినడం వల్ల శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ డి, జింక్ కూడా బాగా అందుతాయి. గుడ్లు బయోటిన్ గొప్ప మూలం. రోజూ గుడ్లను ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. గుడ్లు ప్రతిరోజూ అల్పాహారంగా తినవచ్చు.
విటమిన్ సి ఆహారాలు..
నారింజ, నిమ్మ, ఉసిరికాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి తీసుకోవడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. విటమిన్ సి స్కాల్ప్‌పై కొల్లాజెన్‌ను పెంచడంలో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్-సి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే జుట్టు పెరుగుదల బేషుగ్గా ఉంటుంది.
ఆకు కూరలు..
ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. బచ్చలికూర జుట్టుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మునగ ఆకు కూడా మెరుగ్గా ఫలితాలు ఇస్తుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. రోజూ కాకపోయినా, వారానికి కనీసం రెండు నుండి మూడు సార్లు పాలకూర, మునగ ఆకు తినవచ్చు.
విత్తనాలు, ఎండిన పండ్లు..
గుమ్మడి గింజలు, వాల్‌నట్‌లు, బాదం, అవిసె గింజలు తినడం ద్వారా జుట్టు పెరుగుదల మెరుగ్గా ఉంటుంది. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి నుండి శరీరానికి జింక్ కూడా మంచి పరిమాణంలో అందుతుంది. ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్, గింజలలో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, సెలీనియం సమృద్దిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
క్యారెట్..
విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్లు జుట్టుకు అనేక విధాలుగా మేలు చేస్తాయి. క్యారెట్ తినడం వల్ల జుట్టు పెరుగుదల కణాలు పెరుగుతాయి. క్యారెట్ రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. వీటి వల్ల జుట్టు అకాల బూడిద రంగులోకి మారదు, జుట్టు చాలా సిల్కీగా, షైనింగ్ గా కూడా మారుతుంది.
*రూపశ్రీ.
