ముఖం మీద మచ్చలు తగ్గాలంటే.. కొబ్బరినూనెలో వీటిని కలిపి రాయండి..!

 

మచ్చలేని చర్మం ప్రతి అమ్మాయి కల. కానీ చాలామందికి ముఖం మీద మచ్చలు మొటిమలు, మొటిమల తాలూకు గుర్తులు.. వీటితో ముఖం అంతా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. నిజానికి ఎంత అందంగా ఉన్న అమ్మాయిలను అయినా ఈ మచ్చలు, మొటిమలు, వాటి తాలూకు గుర్తులు వికారంగా కనిపించేలా చేస్తాయి. వీటిని తొలగించుకోవడం కోసం చాలా రకాల వాణిజ్య  ఉత్పత్తులు వినియోగిస్తూ ఉంటారు. అయితే మచ్చలేని చర్మం కోసం వందలు, వేలు ఖర్చు చెయ్యక్కర్లేదు.. ఇంట్లోనే ఉండే కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలు కలిపి రాస్తుంటే చాలు..


కొబ్బరినూనెను రోజూ ముఖానికి రాసుకుని ఫేస్ మసాజ్ చేసుకుంటూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.  ముఖం మీద మచ్చలు, గీతలు క్రమంగా తగ్గిపోతాయి.  ఒక వేళ మచ్చలు, ముడతలు, గీతలు చాలా ఎక్కువగా ఉంటే కొబ్బరినూనెలో కలబంద జెల్ కలపి వాడాలి.  ఒక స్పూన్ కలబంద జెల్,   ఒక స్పూన్ కొబ్బరినూనె కలిపి బాగా మిక్స్ చేయాలి.  దీన్ని రాత్రిపూట ముఖానికి పట్టించాలి.  ముఖానికి పట్టించాక కొన్ని నిమిషాలు ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి.  తరువాత రాత్రంతా దీన్ని అలాగే వదిలేయాలి.  మరుసటిరోజు ఉదయాన్నే చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.  ఈ టిప్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే ముఖం మీద మచ్చలు,  ముడతలు,  గీతలు,  మొటిమల తాలూకు గుర్తులు అన్నీ మాయమవుతాయి.


కొబ్బరినూనెలో కలబంద మాత్రమే కాకుండా పసుపు రాసి ముఖానికి పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.  ఇందుకోసం రెండు నుండి మూడు స్పూన్ల పసుపును తీసుకుని ఒక పాన్ మీద వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. నల్లగా మారే వరకు పసుపును వేయించిన తరువాత స్టౌ ఆఫ్ చేయాలి. పసుపును ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.  చల్లారిన పసుపులోకి కొద్దిగా కొబ్బరి నూనెను వేసి పేస్ట్ లా కలపాలి.  ఈ పేస్ట్ ను ముఖం మీద అప్లై చేయాలి.  20 నిమిషాల తరువాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.  వారానికి రెండు సార్లు ఈ చిట్కా పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.  


                                                 *రూపశ్రీ.