Home

»

Latest News

జనరల్ బోగీలో హీరో విజయ్ ఆంటోనీ: ఎందుకో తెలిస్తే సెల్యూట్ కొడతారు!

Nov 21, 2026 5:42PM


అహ హ అహ హ హ హసిని నీ నవ్వులో ఎవరు ఉన్నట్టు అని పాడుకుంటూ సినీ ప్రేమికులు సినిమా చూస్తుంటారు. అలాంటి సినిమా ఇప్పుడు మీరు ఎక్కే రైలులోకి వచ్చేసింది. అందుకు దారి తీసిన పరిస్థితులేంటో చూద్దాం.

సాధారణంగా సినీ తారలు ప్రమోషన్ల కోసం లగ్జరీ కార్లు, చార్టర్డ్ విమానాలు లేదా ప్రత్యేక ఏర్పాట్లను ఎంచుకుంటారు. కానీ 'బిచ్చగాడు', 'బిచ్చగాడు 2'  ఫేమ్  హీరో విజయ్ ఆంటోనీ మాత్రం ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించాడు. ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం 'అప్పా కుట్టి' సినిమాను మరింత మంది సామాన్య ప్రేక్షకులకు చేరువ చేయడానికి ఆయన ఒక ఆసక్తికరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక సాధారణ ప్రయాణికుడిలా రైలు జనరల్ బోగీలో ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు.

నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'అప్పా కుట్టి' చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్న వేళ, చిత్ర బృందంతో కలిసి విజయ్ ఆంటోనీ చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే కోవై ఎక్స్‌ప్రెస్ రైలులోని అన్‌రిజర్వ్‌డ్ బోగీలో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో సహ ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడం విశేషం. సాధారణ జనరల్ బోగీలో కూర్చుని ప్రజల మధ్యే తన సినిమా విశేషాలను, కథలోని ఆసక్తికర అంశాలను వారితో పంచుకున్నారు. సినీ హీరో తమ పక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుతుండటంతో అక్కడి ప్రయాణికులు ఉత్సాహంతో ఆయనతో మాట్లాడారు, ఫోటోలు తీసుకున్నారు.

 

ముమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీతో పాటు ప్రీతి అస్రాని రోల్ లో కనిపించాడు. విడుదల కాకముందే ఈ సినిమా లాభాల బాట పట్టడం మరో విశేషంగా నిలిచింది. సాధారణ ప్రజల జీవితాలను ప్రతిబింబించే కథలతో ముందుకొచ్చే విజయ్ ఆంటోనీ, నిజ జీవితంలోనూ వారితో మమేకమయ్యే ప్రయత్నం చేయడం సినీ వర్గాల్లోనూ, నెటిజన్లలోనూ చర్చనీయాంశంగా మారింది. జనరల్ బోగీలో ఆయన ప్రయాణిస్తున్న దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: దృశ్యం 3 ఓటీటీ డేట్ వచ్చేసింది.. ఇండియన్ సినీ ప్రేమికులని ఏకం చేసేసింది!
 

ఈ రైలు ప్రయాణంలో తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాలను, తోటి ప్రయాణికులతో జరిపిన సంభాషణలను విజయ్ ఆంటోనీ ఒక ప్రత్యేక ట్రావెల్ వ్లాగ్‌గా చిత్రీకరించారు. ఈ వ్లాగ్‌ను త్వరలోనే సోషల్ మీడియా వేదికలపై విడుదల చేయనున్నట్లు ఆయన టీమ్ వెల్లడించింది. అంతేకాకుండా, కోయంబత్తూర్‌లోని పలు థియేటర్లను సందర్శించి సినిమా చూస్తున్న ప్రేక్షకుల ప్రత్యక్ష స్పందనని తెలుసుకోవాలని కూడా ఆయన ప్లాన్ చేశారు.

 

సినిమా విడుదలైన తర్వాతి రోజు, నవంబర్ 21న ఈ ప్రమోషన్ వార్తలు బయటకు రావడంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రచారం కోసమే కాకుండా, అసలైన సినీ ప్రేమికులైన సాధారణ ప్రజల మనసుల్లోని మాటను వినడానికి ఆయన చేసిన ఈ ప్రయత్నం నిజంగా ప్రత్యేకమైనది. కోవై ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో సాగిన ఈ ప్రయాణం, విడుదలైన ట్రావెల్ వ్లాగ్ ద్వారా 'అప్పా కుట్టి' చిత్రానికి మరింత బజ్ తీసుకువస్తుందనడంలో సందేహం లేదు. సరళత్వంతో కూడిన విజయ్ ఆంటోనీ ప్రమోషన్ స్టైల్ మరోసారి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటోంది

మీకు నచ్చవచ్చు :థియేటర్లకి గ్రామీణ ప్రేక్షకులు దూరమయ్యారా? దగ్గరయ్యారా?
మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార ఫస్ట్ డే కలెక్షన్స్!

. 

[Vijay Antony, Appa Kutty, Kovai Express, kollywood]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com