Home

»

Latest News

దృశ్యం 3 ఓటీటీ డేట్ వచ్చేసింది.. ఇండియన్ సినీ ప్రేమికులని ఏకం చేసేసింది!

Nov 21, 2026 5:22PM

భారతీయ సినీ ప్రేమికులని అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు ఏకతాటి పైకి తీసుకొస్తాయి. అలాంటి ఒక చిత్రమే దృశ్యం 3 . సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి  కేరాఫ్ అడ్రస్‌గా కూడా  నిలిచిన ' దృశ్యం 3: ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది.


ఈ  నెల  27 (శుక్రవారం) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో  మిస్ అయిన ప్రేక్షకులతో పాటు, మరోసారి ఈ మైండ్ గేమ్‌ను ఇంట్లోనే చూడాలనుకునే సినీ అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండుగ వార్త అనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన అధికారిక లిస్ట్‌లో 'కమింగ్ ఆన్ ఫ్రైడే' ట్యాగ్‌తో ఈ విడుదల తేదీని స్పష్టం చేయడంతో, ఓటీటీ విడుదలపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది.

అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కగా అక్టోబర్ 2 న   థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. దాదాపు 100 కోట్ల నుంచి  110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి తొలి రోజే  66.75 కోట్ల భారీ వసూళ్లతో సంచలన ఆరంభాన్ని అందుకుంది. తొలి వారంలోనే ఇండియా నెట్ కలెక్షన్లు 245.50 కోట్లకు చేరుకున్నాయి.

పూర్తి రన్‌లో ఈ చిత్రం భారత్‌లో రూ. 380 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 590 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి అజయ్ దేవగన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు, ఈ ఏడాది బాలీవుడ్‌లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.

ఇది కూడా చదవండి: థియేటర్లకి గ్రామీణ ప్రేక్షకులు ఎందుకు దూరమయ్యారు? 

మొదటి రెండు భాగాలు మలయాళ 'దృశ్యం' సిరీస్‌కు రీమేక్‌లుగా రాగా, ఈ మూడో భాగం మాత్రం సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టింది. విజయ్ సల్గావ్కర్ పాత్రలో అజయ్ దేవగన్ తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో కుటుంబాన్ని కాపాడుకునే తీరు మరోసారి హైలైట్‌గా నిలిచింది. సామ్ దేశ్‌ముఖ్ హత్య కేసు మళ్లీ తెరపైకి రావడం, కొత్త ఆధారాలతో రంగంలోకి దిగిన ఎస్పీ రాజ్‌వీర్ సింగ్ తోమర్ (జైదీప్ అహ్లావత్)తో మీరా దేశ్‌ముఖ్ (తబు) చేతులు కలపడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. శ్రియా శరణ్, ఇషితా దత్తా, రజత్ కపూర్ వంటి నటులు కీ రోల్స్ లో  మెరిశారు.

ఈ సందర్భంగా ప్రేక్షకులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. అజయ్ దేవగన్ నటించిన హిందీ 'దృశ్యం 3: ద కన్‌క్లూజన్' నవంబర్ 27న నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుండగా, మోహన్ లాల్ నటించిన మలయాళ 'దృశ్యం 3' మాత్రం జూన్ 18, 2026 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. రెండు చిత్రాలకు ఒకే ఫ్రాంచైజీ పేరు ఉన్నప్పటికీ, తారాగణం మరియు ఓటీటీ వేదికలు వేరువేరు. అందువల్ల వెతికేటప్పుడు పొరబడకుండా సరైన మూవీని ఎంచుకోవడం మంచిది .ఆల్ ది బెస్ట్.

 

మీకు నచ్చవచ్చు :ఆ సినిమాకి  కలెక్షన్లు ఎందుకు రావడం లేదు!
మీకు నచ్చవచ్చు: అలియాస్ రుక్మిణి నితిన్ కి ఏ గిఫ్ట్ ఇవ్వబోతుంది!

 

[ Drishyam 3, Ajay Devgn, Tabu,Sriya, Bollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com