.webp)
తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటుతూ ఆకాశంలో ఒక తార బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నిన్న ఈవినింగ్ షో కి అయితే చాలా రోజుల తర్వాత రెగ్యులర్ ప్రేక్షకులతో పాటు మోస్ట్ పవర్ ఫుల్ హై క్లాస్ పీపుల్స్, ఉన్నత విద్యావంతుల హోదాలో ఐపిఎస్, ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సైతం ఆకాశంలో ఒక తార కోసం థియేటర్స్ లో తిష్ట వేశారు. దీన్ని బట్టి విజయాన్ని అందుకోబోయే రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సుమారు 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లని సొంతం చేసుకుంది. మొదటి రోజు ఇండియా గ్రాస్ అయితే 3 కోట్లు. , దేశవ్యాప్తంగా దాదాపు 2,079 షోలతో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు 27.7 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 60.29 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 49.72 లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్‌తో మెజారిటీ వసూళ్లు తెలుగు వెర్షన్ నుంచే వచ్చాయి.
అయితే దుల్కర్ సల్మాన్ గత సినిమాలతో పోలిస్తే ఆకాశంలో ఒక తారకు వచ్చిన ఓపెనింగ్స్ కాస్త తక్కువగానే ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అదే రోజు ధనుష్, మమ్ముట్టి కలిసి నటించిన ఓఎం: ఆపరేషన్ మోల్ వంటి భారీ యాక్షన్ థ్రిల్లర్ విడుదలై బాక్సాఫీసు వద్ద పోటీ ఇవ్వడమే.
.webp)
దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే మంచి రికవరీ సాధించింది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ ఓటీటీ హక్కులను ఏకంగా 34 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.బాక్సాఫీసు వద్ద ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే 30 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్, అంటే దాదాపు 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సిన టార్గెట్ ఉంది.
ఇది కూడా చదవండి:పవన్ కళ్యాణ్ పై ఉపాసన కొణిదెల వ్యాఖ్యలు వైరల్!
మొదటి రోజు 4 కోట్ల గ్రాస్‌తో డీసెంట్ స్టార్ట్ అందుకున్న ఈ చిత్రం, పాజిటివ్ మౌత్ టాక్ సహాయంతో శనివారం, ఆదివారం వీకెండ్‌లో భారీగా పుంజుకునే అవకాశం ఉంది. శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 1.08 కోట్లు, ఆదివారం 1.13 కోట్లు దాటడం సినిమాకు కలిసొచ్చే అంశం. ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడితే దుల్కర్ ఖాతాలో మరో క్లాసిక్ హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
.webp)
సాత్విక వీరవల్లి టైటిల్ రోల్ కాగా శ్రుతి హాసన్, రుహానీ శర్మ, స్వాసిక కీ రోల్స్ లో మెరిశారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ తో కలిసి గుణ్ణం గంగరాజు నిర్మించాడు. పవన్ సాదినేని దర్శకుడు.
మీకు నచ్చవచ్చు: సాత్విక బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు: మీ ఆకాశంలో ఒక తార!
మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార షాకింగ్ రివ్యూ!
[Aakasamlo oka tara, dulqer salmaan, sathvika veeravalli, shruthi haasan, pawan sadineni]





.webp)
