Home

»

Latest News

‘డ్రాగన్‌’లో చర్చి సీక్వెన్స్‌.. ఎన్టీఆర్‌, రుక్మిణి వసంత్‌పై భారీ పెళ్లి వేడుక!

Nov 21, 2026 6:11PM

ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్‌’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘సలార్‌’, ‘కేజీఎఫ్‌’ చిత్రాలతో తనదైన యాక్షన్‌ ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్‌ను 1967 నాటి కథలో చూపించబోతున్నారు. అప్పటి నల్లమందు వ్యాపారం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ‘లూగర్‌’ అనే పాత్రలో కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. 70 రోజులకు పైగా నిరంతరంగా చిత్రీకరణ కొనసాగించిన చిత్ర బృందం.. ఇప్పుడు కథలో కీలకమైన చర్చి సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

ఈ సన్నివేశాలకు అనుసంధానంగా ఎన్టీఆర్‌-రుక్మిణి వసంత్‌ భారీ పెళ్లి వేడుకను కూడా చిత్రీకరిస్తున్నారట. కథలో ఈ సన్నివేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, రుక్మిణి వసంత్‌, బిజు మీనన్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ నార్కోటిక్స్‌ చీఫ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్‌ పాత్రకు, ఆయన పాత్రకు మధ్య ఎలాంటి సంఘర్షణ ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు బలమైన కథ, భావోద్వేగాలకు కూడా ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు టాక్‌.

ఇది కూడా చదవండి: తాత టైటిల్‌తో తారక్ మూవీ.. అనిల్‌ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదు.!

మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 2027 జూన్‌ 11న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొత్తానికి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ చర్చి, పెళ్లి వేడుకల ఎపిసోడ్‌ ‘డ్రాగన్‌’లో కీలకమైన భాగం కానుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌ మార్క్‌ మేకింగ్‌, ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌ పాత్ర, భారీ తారాగణంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా!
పైరసీ కలకలం.. రిలీజ్ రోజే ఆన్‌లైన్‌లోకి ‘ఆకాశంలో ఒక తార’.!

 

 

 

[Jr NTR, Dragon Movie, Church Sequence, Rukmini Vasanth, Prashanth Neel]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com