'సంచారి' సాంగ్ టీజర్.. లుక్స్ తో ఫిదా చేస్తున్న ప్రభాస్!
on Dec 14, 2021
.webp)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'రాధేశ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'ఈ రాతలే', 'నగుమోము తారలే' సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా మూడో సాంగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
Also Read: రానా, రాజమౌళి, ప్రభాస్.. వారానికో పిరియడ్ డ్రామా!
'రాధేశ్యామ్' నుంచి 'సంచారి' సాంగ్ టీజర్ తాజాగా విడుదలైంది. 'ఛలో ఛలో సంచారి' అంటూ సాగుతున్న ఈ సాంగ్ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లో ప్రభాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'డార్లింగ్', 'మిర్చి' సినిమాల సమయంలో అమ్మాయిల కలల రాకుమారుడిలా ఎంత అందంగా కనిపించేవాడో.. ఈ సాంగ్ టీజర్ లో ప్రభాస్ అంత అందంగా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ టీజర్ లో సంచారి అనే పేరుకి తగ్గట్లుగానే ప్రభాస్ అందమైన విభిన్న ప్రదేశాల్లో సంచరిస్తూ కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ ఫుల్ వీడియో ప్రేక్షకులకు కనుల విందుని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
Also Read: మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'అఖండ'!
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన 'సంచారి' సాంగ్ కి కృష్ణ కాంత్ లిరిక్స్ అందించాడు. 'ఈ రాతలే', 'నగుమోము తారలే' సాంగ్స్ కి కూడా ఆయనే లిరిక్స్ అందించడం విశేషం. 'సంచారి' సాంగ్ ని కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ ఆలపించాడు.
Also Read: శృంగారంతో ఆనందం..అషురెడ్డి బోల్డ్ కామెంట్స్
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



