రానా, రాజమౌళి, ప్రభాస్.. వారానికో పిరియడ్ డ్రామా!
on Dec 13, 2021

`బాహుబలి` సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సిరీస్ లో హీరోగా నటించిన ప్రభాస్, విలన్ గా భయపెట్టిన రానా దగ్గుబాటి, ఆ చిత్రాన్ని విజువల్ వండర్ గా మలిచిన దర్శకుడు రాజమౌళి.. ఆ సంచలన విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు. పాన్ - ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో మళ్ళీ ఎప్పుడు సినిమా వస్తుందో తెలియదు కానీ.. త్వరలో వరుసగా మూడు వారాల పాటు ఈ ముగ్గురు తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇవన్నీ కూడా పిరియడ్ డ్రామాలే.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ నెల 31న `1945` అంటూ ఓ పిరియడ్ డ్రామాతో పలకరించబోతున్నారు రానా. టైటిల్ కి తగ్గట్టే ఆ కాలంలోకి తీసుకెళ్ళనుంది ఈ సినిమా. ఇక వారం తరువాత అంటే.. జనవరి 7న రాజమౌళి రూపొందించిన క్రేజీ ప్రాజెక్ట్ `ఆర్ ఆర్ ఆర్` రాబోతోంది. ఫిక్షనల్ గా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. 1920ల నాటి కాలంలోకి తీసుకెళ్ళనుంది. కట్ చేస్తే.. మరో వారం తరువాత అంటే జనవరి 14న ప్రభాస్ నటించిన `రాధే శ్యామ్` రానుంది. ఈ రొమాంటిక్ డ్రామా 1970ల నాటి టైమ్ లైన్ లో ఎంటర్టైన్ చేయనుంది. మరి.. యాదృచ్ఛికంగా వారానికో పిరియడ్ డ్రామాతో రాబోతున్న `బాహుబలి` మెయిన్ టీమ్.. ఆయా చిత్రాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



