మహేష్ బాబుకు సర్జరీ.. 'సర్కారువారి పాట' మరింత ఆలస్యం కానుందా?
on Dec 14, 2021

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ జరిగింది. చాలాకాలం నుంచి మోకాలినొప్పితో బాధపడుతున్న ఆయన స్పెయిన్ లో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also Read: శృంగారంతో ఆనందం..అషురెడ్డి బోల్డ్ కామెంట్స్
2014 నుంచి మహేష్ మోకాలినొప్పితో ఇబ్బందిపడుతున్నారని తెలుస్తోంది. అయితే 'సర్కారువారి పాట' మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న ఆయనను మోకాలినొప్పి బాగా ఇబ్బంది పెడుతుండటంతో.. తాజాగా సర్జరీ చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. దీంతో 'సర్కారువారి పాట' షూటింగ్ బ్రేక్ పడిందని సమాచారం. కొన్నిరోజుల విశ్రాంతి తర్వాత ఆయన తిరిగి షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.
Also Read: మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'అఖండ'!
నిజానికి 'సర్కారువారి పాట'ని సంక్రాంతికి విడుదల చేయాలని మొదట మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇటీవల విడుదల తేదీని ఏప్రిల్ 1 కి మారుస్తూ ప్రకటన చేశారు. మహేష్ సర్జరీ నేపథ్యంలో.. 'సర్కారువారి పాట' ఏప్రిల్ 1 కి అయినా విడుదలవుతుందా లేక మరింత ఆలస్యమవుతుందా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



