మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'అఖండ'!
on Dec 14, 2021

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించగా, బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన 'అఖండ' మూవీ ఇంటా, బయటా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బాలయ్య కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసిన 'అఖండ' యుఎస్ఏలోనూ ట్రెమండస్ కలెక్షన్స్‌ను సాధిస్తోంది. కరోనా టైమ్స్‌లోనూ మిలియన్ డాలర్లను వసూలు చేసి, సంచలనం సృష్టించింది.
ఓవర్సీస్‌లో 'అఖండ'ను రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేసింది. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇదే ఫస్ట్ ఫిల్మ్ కావడం గమనార్హం. తొలి చిత్రంతోనే వారు మిలియన్ మార్క్‌ను అందుకున్నారు. ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ ఏరియాల్లోనూ 'అఖండ'కు అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి.
Also read: సమంత 'ఊ అంటావా మావ' సాంగ్ పై కోర్టుకెళ్లిన పురుషుల సంఘం!
ఓవర్సీస్‌లోనూ బాలకృష్ణ సినిమాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా 'అఖండ' నిలుస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వీక్ డేస్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో, వీకెండ్స్‌లో మరింత బాగా వసూళ్లు వస్తున్నాయి. 'అఖండ'ను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు.
Also read: 11వ రోజు 'సైరా', 'అల.. వైకుంఠపురములో'ను మించిన 'అఖండ'!
మురళీకృష్ణ, అఖండ అనే కవల సోదరులుగా బాలయ్య నటించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, నితిన్ మెహతా, జగపతిబాబు, ప్రభాకర్ కీలక పాత్రలు చేశారు. తమన్ మ్యూజిక్ ఇవ్వగా, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



