'హాఫ్ లయన్' పేరుతో పీవీ బయోపిక్.. నటుడు ఎవరు?
on Dec 14, 2021

కొన్నేళ్లుగా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖుల బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని రాబోతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బయోపిక్ చేరింది. 'హాఫ్ లయన్' పేరుతో ఆయన బయోపిక్ పాన్ ఇండియా సిరీస్ గా తెరకెక్కనుంది.
Also Read: లాఠీఛార్జ్ లో గాయపడిన ఫ్యాన్స్.. బన్నీ రియాక్షన్!
వినయ్ సీతాపతి రాసిన ‘హాఫ్ లయన్’ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్న ఈ సిరీస్ కు బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ ఝా దర్శకత్వం వహించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సిరీస్ 2023 లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
Also Read: మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'అఖండ'!

Also Read: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు ఊహించని స్టార్స్
ఈ వెబ్ సిరీస్ లాంఛింగ్ ను తాజాగా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. అయితే ఈ సిరీస్ లో పీవీ పాత్రలో నటించే నటుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ మమ్మూట్టి వంటి పేర్లు వినిపిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



