యూఎస్ టాప్ గ్రాసర్స్ లిస్టులో 'పుష్ప'!
on Dec 28, 2021

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన యాక్షన్ డ్రామా 'పుష్ప' యూఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ వసూళ్లను సాధిస్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన ఈ ఎర్రచందనం నేపథ్య చిత్రం రెండో సోమవారం 30 వేల డాలర్లకు పైగా వసూలుచేసి రానున్న రోజుల్లో మరింతగా వసూళ్లను సాధించగల స్టామినా తనకు ఉందని తెలియజేసింది. పాండమిక్ టైమ్‌లోనూ తెలుగు సినిమాలకు సంబంధించి అత్యధిక వసూళ్లను సాధించిన 15 చిత్రాల జాబితాలో చోటు సంపాదించింది 'పుష్ప'. ప్రస్తుతం ఈ లిస్టులో 14వ స్థానంలో ఉన్న ఈ మూవీ ఇంకెంత పైకెగబాకుతుందో చూడాల్సి ఉంది.
Also read: బన్నీని తక్కువ అంచనా వేశా.. థాంక్యూ మీట్ లో సుకుమార్ కంటతడి!
ఇటు అల్లు అర్జున్ (అల.. వైకుంఠపురములో)కూ, అటు సుకుమార్ (రంగస్థలం)కూ వరుసగా 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన సినిమాగా 'పుష్ప' నిలవడం గమనార్హం. ఇక రష్మిక విషయానికి వస్తే.. ఆమెకు ఇది 2 మిలియన్ ప్లస్ డాలర్లను వసూలు చేసిన మూడో మూవీ! ఇదివరకు 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ఆ ఫీట్‌ను సాధించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప యూఎస్ మార్కెట్‌లో బ్రేకీవెన్ సాధించాలంటే మరో లక్ష డాలర్లను వసూలు చేయాల్సి ఉంది.
Also read: అల్లు అర్జున్ 'తగ్గేదే లే'ను ప్రపంచవ్యాప్తంగా ఇమిటేట్ చేస్తున్నారు!
యూఎస్ఏ టాప్ 15 తెలుగు గ్రాసర్స్:
బాహుబలి 2 - $20 మిలియన్
బాహుబలి - $6.8 మిలియన్
అల వైకుంఠపురములో - $3.6 మిలియన్
రంగస్థలం - $3.5 మిలియన్
భరత్ అనే నేను - $3.4 మిలియన్
సాహో - $3.2 మిలియన్
శ్రీమంతుడు - $2.8 మిలియన్
సైరా.. నరసింహారెడ్డి - $2.6 మిలియన్
మహానటి - $2.5 మిలియన్
గీత గోవిందం - $2.4 మిలియన్
అ ఆ - $2.4 మిలియన్
ఖైదీ నంబర్ వన్ - $2.4 మిలియన్
సరిలేరు నీకెవ్వరు - $2.2 మిలియన్
పుష్ప - $2.2* మిలియన్
అరవింద సమేత - $2.1 మిలియన్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



