సుకుమార్ లేకపోతే నేను లేను.. ఎమోషనల్ అయిన బన్నీ!
on Dec 28, 2021

హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఇక నుండి తాను చేసిన ప్రతి సినిమాకి థాంక్యూ మీట్ నిర్వహిస్తానని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ఇటీవల విడుదలైన 'పుష్ప ది రైజ్' భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుండటంతో తాజాగా మూవీ టీమ్ హైదరాబాద్ లో థాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ తన ప్లాప్ సినిమాకి కూడా థాంక్యూ మీట్ నిర్వహిస్తానని చెప్పారు.
"కరోనా కారణంగా లాస్ట్ ఇయర్ డల్ గా ఎండ్ అయింది. కనీసం ఈ ఇయర్ అయినా మంచిగా ఎండ్ అవ్వాలని కోరుకున్నాను. ఈ ఇయర్ ఇంత జాయ్ తో ఎండ్ అవుతుండటం సంతోషంగా ఉంది. అందుకే థాంక్యూ మీట్ నిర్వహించాం. పోస్టర్ మీద ఒక వ్యక్తి కనిపిస్తాడు కానీ దాని వెనక వందల మంది కష్టం ఉంటుంది. వాళ్లందరికీ థాంక్యూ చెప్పడానికే ఈ ఈవెంట్ పెట్టాం. మాములుగా సినిమా ప్లాప్ అయితే థాంక్యూ మీట్ పెట్టరు. కానీ సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా దానికి పడే కష్టం ఒక్కటే. అందుకే హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఇక నుండి నా ప్రతి సినిమాకి థాంక్యూ మీట్ పెట్టాలి అనుకుంటున్నాను" అని బన్నీ అన్నారు.
ఈ సందర్భంగా పుష్పకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా బన్నీ థాంక్స్ చెప్పారు. తెలుగుతో పాటు అన్ని భాషలలో ఉన్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి, అందరి మనసుల్లో స్థానం సంపాదించాలి అనుకున్నాను. అందరి సపోర్ట్ తో ఇప్పుడు పుష్పతో ఇది సాధ్యపడినందుకు సంతోషంగా ఉంది అని బన్నీ అన్నారు.
నటీనటులకు పేరుపేరునా థాంక్స్ చెప్పిన బన్నీ.. కేశవ పాత్రలో నటించిన జగదీష్ ని ప్రత్యేకంగా అభినందించారు. "రెండు సంవత్సరాలు ఈ సినిమా కోసం లైఫ్ పెట్టి పని చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లో ఇద్ద పెద్ద క్యారెక్టర్ రావడం గొప్ప విషయం. అతనికి ఆ కాలిబర్ ఉంది. పుష్ప షూట్ టైంలో ఆర్టిస్ట్ అవుతానంటే ఎవరూ ఎంకరేజ్ చెయ్యట్లేదు, పెళ్లి కూడా కావట్లేదు సార్ అని నాతో అన్నాడు. ఈ సినిమాతో నీ టాలెంట్ ని ఇండియా మొత్తం చూస్తుంది అని అప్పుడు చెప్పా. అన్నట్లుగానే పుష్ప రిలీజ్ తర్వాత నా లైఫ్ మారిపోయిందని చెప్పాడు." అని బన్నీ చెప్పుకొచ్చారు.
సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని బన్నీ అన్నారు. "సుకుమార్ ఉంటే నా లైఫ్ ఒకలా ఉంది. లేకపోతే వేరేలా ఉండేది. అప్పుడు సుకుమార్ తో సినిమా చేయబట్టే ఇప్పుడు నన్ను ఐకాన్ స్టార్ వరకు తీసుకొచ్చింది. నేను లైఫ్ లో చాలా తక్కువమందికి రుణపడి ఉంటాను. వారిలో నా తల్లిదండ్రులు, మా తాతగారు, చిరంజీవి గారితో పాటు సుకుమార్ ఉన్నారు. సుకుమార్ డార్లింగ్ లేకపోతే నేను లేను" అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు. బన్నీ మాటలకు సుకుమార్ కూడా కంటతడి పెట్టుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



