నర్స్ అవతారంలో సామ్!
on Dec 28, 2021

వైవిధ్యానికి పెద్దపీట వేసే కథానాయికల్లో చెన్నై పొన్ను సమంత ఒకరు. ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రలతో నటిగా తనదైన ముద్రవేసిన సామ్.. ప్రస్తుతం రెండు పాన్ - ఇండియా మూవీస్ లో నటిస్తోంది. అందులో ఒకటి `శాకుంతలం` కాగా.. మరొకటి `యశోద`. మైథలాజికల్ మూవీగా రూపొందుతున్న `శాకుంతలం`లో శకుంతలగా దర్శనమివ్వనుంది సామ్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
ఇదిలా ఉంటే.. `యశోద` చిత్రంలో సమంత పోషించే పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో సామ్ ఓ నర్స్ గా కనిపిస్తుందట. అదే గనుక నిజమైతే.. ఇది తనకి ఓ కొత్త తరహా వేషమనే చెప్పాలి. త్వరలోనే `యశోద`లో సామ్ క్యారెక్టర్ పై క్లారిటీ వస్తుంది. కాగా, నూతన దర్శకులు హరి - హరీశ్ తెరకెక్కిస్తున్న `యశోద` ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశముంది. మరి.. `శాకుంతలం`, `యశోద` చిత్రాలతో సామ్ ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



