ఫస్ట్ మూవీకే గిఫ్ట్ కొట్టేసిన నిహారిక..
on Jun 14, 2016
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. నిహారిక, నాగశౌర్య జంటగా, టీవీ9 సమర్ఫణలో మధుర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన "ఒక మనసు" ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ టైంలో తన బిడ్డ ఫస్ట్‌టైం ఆన్ స్క్రీన్ మీద ఎలా చేసిందోనన్న టెన్షన్లో ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఫైనల్ అవుట్పుట్లోనూ, ట్రైలర్స్ అన్నింటిలోనూ నిహారిక తన ఛార్మింగ్‌తో మెస్మరైజింగ్ చేస్తుండటంతో చాలా ఖుషిగా ఉన్నారట. ఈ నేపథ్యంలో తన గారాలపట్టిని సర్ప్రైజ్ చేశారు నాగబాబు. నిహారికకు ఖరీదైన ఆడికారు గిఫ్టుగా ఇచ్చారు. ఈ సందర్భంగా కారు షోరూంలో తండ్రి కూతుళ్లు హల్చల్ చేశారు ఆ ఫోటోలు మీకోసం.