తాను చెప్పేస్తానంటున్న కాజల్ ..!
on Jun 14, 2016
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతున్నా..వయసు మీదపడుతున్నా ఇప్పటికి వన్నెతగ్గని అందం కాజల్‌ది..టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీని వదలకుండా దున్నేస్తున్న కిలాడి కాజల్. అయితే ఆమెకు ఒక తీరని కోరిక మిగిలిపోయింది. అదే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం. కాజల్ కంటే ముందు చాలా మంది ఉత్తరాది భామలు తమ పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఛార్మి, తాప్సీ..రీసెంట్గా రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకుంటుండటంతో కాజల్ కాస్త ఫీలైందట. దాంతో నిన్న, మొన్న వచ్చిన వాళ్లు చెప్పగా లేనిది తాను చెప్పలేనా అని..గొంతు విప్పాలనుకుంటోంది. విక్రమ్‌తో కలిసి తమిళ్లో గరుడ అనే సినిమా చేస్తోన్న కాజల్ ఈ సినిమా సక్సెస్ కోసం అన్ని రకాలుగా కష్టపడుతోంది. దీంతో డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇదే మంచి సమయంగా భావిస్తోంది.