బాహుబలి బతికే ఉన్నాడు..!
on Jun 14, 2016
బాహుబలి పార్ట్-1 ఎండ్ కార్డ్ పడేముందు..ప్రపంచ సినీ ప్రేక్షకులను సస్పెన్స్‌లో పడేశాడు దర్శకధీరుడు రాజమౌళి . అదేంటంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని. ఆ క్వశ్చన్ అందరి మెదళ్లను తొలిచేసింది. కట్టప్ప నమ్మకస్తుడు కదా..! అలాంటి వ్యక్తి బాహుబలిని ఎందుకు చంపాడు. అదంతా ఒక ఎత్తైతే అమరేంద్ర బాహుబలిని చంపడాన్ని సగటు ఆడియన్ ఓన్ చేసుకోలేకపోయాడు. అతను బతికుంటే బాగుణ్ణు అని కోరుకున్నారు. అయితే ప్రస్తుతం బాహుబలి-2కి సంబంధించిన క్లైమాక్స్ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో యమ స్పీడుగా జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆప్‌డేట్స్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. మొదటి రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక..ఓ ఫోటో కూడా విడుదల చేసింది బాహుబలి-2 టీమ్. దానిలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఓ చెయ్యి..ఆనందంతో గెంతులు వేస్తున్న రాజమౌళి అండ్ టీమ్ కింద కనిపిస్తారు. అయితే..ఆ చెయ్యి అనేక అనుమానాలు రేకిత్తిస్తోంది..?
ఇది తండ్రి పాత్ర అయిన అమరేంద్ర బాహుబలిదే అని చెబుతున్నారు అభిమానులు. అందుకు చేతికి కనిపిస్తున్న మాహిష్మతి కడియాన్ని సాక్ష్యంగా చూపెడుతున్నారు. అది కొడుకు శివుడు చెయ్యి అనుకోవచ్చు. అయితే శివుడు భల్లాలదేవుడికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారితో ఉంటాడు కాబట్టి..ఆ కడియం భల్లాలదేవుడిని ఓడిస్తేనే సాధ్యమవుతుంది. దానికి తోడు గతంలో రచయిత విజయేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో..బాహుబలిని కట్టప్ప చంపాడనే ఎందుకు అనుకుంటున్నారు..పొడిచాడంతే అన్నారు. సో ఈ వాదనలన్నీ చూస్తే ఆ చెయ్యి అమరేంద్ర బాహుబలిదే అని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా రాజమౌళి ట్విస్ట్‌ని ఊహించడం కష్టం..సో మీ డౌట్ క్లారిఫై కావాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయకతప్పదు.