మహిళా దర్శకురాలితో కాజల్ సినిమా
on Mar 12, 2020

కథానాయికగా కాజల్ అగర్వాల్ ప్రయాణం ప్రారంభమై ఈ ఏడాదికి పదమూడు ఏళ్లు. తేజ దర్శకత్వంలో తొలి సినిమా 'లక్ష్మీ కళ్యాణం', కృష్ణవంశీ దర్శకత్వంలో మలి సినిమా 'చందమామ' చేశారు. కృష్ణవంశీ సినిమాతో కాజల్ దశ తిరిగింది. ఆమెకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ స్టేటస్ అందుకున్నారు. అఫ్ కోర్స్... మధ్యలో ఫ్లాపులు వచ్చినా స్టార్ హీరోల పక్కన చేసిన సినిమాలో సూపర్ సక్సెస్ అవ్వడంతో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆమెకు రాలేదు. పదమూడు ఏళ్ల ప్రయాణంలో కాజల్ ఏనాడు ప్రయోగాల జోలికి పోలేదు. కమర్షియల్ చిత్రాలే ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు తొలిసారి ఓ ప్రయోగం చేస్తున్నారు.
ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ఒక సినిమా అంగీకరించారు. మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, అదితి రావు హైదరి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గురువారం చెన్నైలో ప్రారంభమైంది. మహిళా దర్శకురాలితో కాజల్ చేస్తున్న తొలి సినిమా ఇది. డాన్స్ నుంచి డైరెక్షన్ వైపు వచ్చిన ప్రభుదేవా, రాఘవ లారెన్స్ కమర్షియల్ సినిమాలే ఎక్కువ తీశారు. బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ రూటు కూడా కమర్షియల్ సినిమాలే. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ లో మెగా ఫోన్ పట్టిన లేడీ డైరెక్టర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఆర్ట్ సినిమాలు తీయడానికి ఎక్కువ మొగ్గు చూపారు. మరి బృంద ఏ విధమైన సినిమా తీస్తారో? ఒకరకంగా కాజల్ కెరీర్లో ఈ సినిమా ప్రయోగమని చెప్పుకోవాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



