`పుష్ప - ద రైజ్` బాటలోనే `పుష్ప - ద రూల్`!
on Feb 2, 2022

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం `పుష్ప - ద రైజ్`. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. పాన్ - ఇండియా మూవీగా రిలీజై వసూళ్ళ వర్షం కురిపించింది. మరీముఖ్యంగా.. హిందీనాట అనూహ్య విజయం సాధించింది. ఇందులో పుష్ప రాజ్ గా బన్నీ నటన సినిమాకే ఎస్సెట్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే, `పుష్ప - ద రైజ్`కి కొనసాగింపుగా `పుష్ప - ద రూల్` పేరుతో సెకండ్ పార్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే చిత్రీకరణ బాట పట్టనున్న టీమ్.. తాజాగా రిలీజ్ డేట్ లాక్ చేసిందట. `పుష్ప - ద రైజ్` విడుదలైన డిసెంబర్ 17నే `పుష్ప - ద రూల్`కి కూడా విడుదల తేదిగా ఫిక్స్ చేశారని సమాచారం. మరి.. 2021 డిసెంబర్ 17న రిలీజై `పుష్ప - ద రైజ్` ఎలాగైతే సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. అదే తరహాలో 2022 డిసెంబర్ 17న రానున్న `పుష్ప - ద రూల్` కూడా సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
కాగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్న `పుష్ప - ద రూల్`ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. తొలి భాగంలో నటించిన రష్మికా మందన్న, ఫహద్ ఫాజిల్ తో పాటు పలువురు నటీనటులు రెండో భాగంలోనూ కొనసాగనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



