సింగిల్ టేక్ లో రెండు పేజీల డైలాగ్ చెప్పిన 'బిగ్ బాస్' కౌశల్!
on Feb 2, 2022

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వంలో రూపొందిన వినూత్న కథా చిత్రం 'అతడు-ఆమె-ప్రియుడు'. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. సంధ్య మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'అతడు-ఆమె-ప్రియుడు' నుంచి తాజాగా ఓ డైలాగ్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న కౌశల్ లో అద్భుతమైన నటుడు ఉన్నాడని తెలిపేలా ఈ వీడియో ఉంది. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్ ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి ఆశ్చర్యపరిచాడు. దీంతో కౌశల్ చెప్పిన ఈ సింగిల్ టేక్ డైలాగ్ వీడియోని యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. యండమూరి చేతులమీదుగా ఈరోజు(బుధవారం) విడుదలైన కౌశల్ సింగిల్ టేక్ డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నటుడిగా కౌశల్ కు ఉజ్వల భవిష్యత్ ఉందని యండమూరి ప్రశంసించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



