వరుణ్ తేజ్ తో పెళ్లి వార్తలపై లావణ్య త్రిపాఠి రియాక్షన్!
on Feb 2, 2022

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై తాజాగా స్పందించిన లావణ్య.. తన పెళ్లి ఎవరితోనో ఇంకా తనకే తెలియదంటూ చెప్పుకొచ్చింది.
'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హ్యాపీ బర్త్‌డే' సినిమా షూటింగ్ పాల్గొన్న లావణ్య.. తాజాగా షూటింగ్ బ్రేక్ లో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌చాట్ లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకి పెళ్లి రూమర్స్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. “కొంతమంది ఈ రూమర్స్ ఎలా పుట్టిస్తారో తెలియదు. నా పెళ్లి ఎవరితో అనేది ఇంతవరకు నాకే తెలియదు. నా పెళ్లి గురించి నాకు తెలియని విషయం వేరే వాళ్లకు ఎలా తెలుస్తుందో’ అంటూ సమాధానం లావణ్య ఇచ్చింది. అయితే 'ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా?' అనే ప్రశ్నకు మాత్రకు లావణ్య సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం.
కాగా 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాలలో వరుణ్, లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలొచ్చాయి. దానికితోడు గా వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో లావణ్య కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే లావణ్య, నిహారిక మంచి ఫ్రెండ్స్ అని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



