అల్లు అరవిందే కాదు, 'అన్‌స్టాపబుల్' ప్రపోజల్‌తో ఎవరొచ్చినా నేను చేసుండేవాడ్ని!
on Jan 12, 2022

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షో బ్లాక్‌బస్టర్ హిట్టయింది. అసలు బాలయ్య ఏమిటి? టాక్ షో హోస్ట్ ఏమిటి?.. అనుకున్న వాళ్లను షాక్‌కు గురిచేస్తూ తెలుగునాటే కాదు, ఐఎండీబీ ప్రకారం యావత్భారతంలోనే టాప్ టాక్ షోగా నిలిచింది. అసలు 'అన్‌స్టాపబుల్' టాక్ షోను ఆయన ఎలా ఒప్పుకున్నారు? దాని హోస్ట్‌గా ఆయన పొందిన అనుభూతి ఏమిటి? అనే ప్రశ్నకు 'అఖండ' సంక్రాంతి సంబరాల్లో జవాబిచ్చారు బాలయ్య.
"ఇది కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా జరిగింది. ఒకసారి అల్లు అరవింద్ గారు చెప్పారు.. 'ఇలా చేద్దామనుకుంటున్నాం, మీరు హోస్ట్‌గా ఉంటే బాగుంటుంది' అని. వినగానే నేను వెనకా, ముందూ ఆలోచించలేదు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునేవాడ్ని. నాన్నగారు కూడా 20 సంవత్సరాలు ముందుగా ఆలోచించేవారు. 'తోడుదొంగలు', 'పిచ్చి పుల్లయ్య' సినిమాలు తీశారు. ఆర్థికంగా అవి లాభం చేకూర్చకపోయినా పదేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని ఉద్దేశించి తీసిన సినిమాలవి." అని ఆయన తెలిపారు.
Also read: 37 ఏళ్ల తర్వాత కూడా బాలయ్య ఎనర్జీ వెనకున్న రహస్యమిదే!
తనెప్పుడూ చాలా ముందుగా ఆలోచిస్తుంటాననేది బాలయ్య చెప్పే మాట. "నేను చెప్పిన కథలను నాతో తియ్యడానికి నిర్మాతలు, దర్శకులు సాహసించలేకపోవచ్చు. అంత ముందు ఆలోచిస్తుంటాం. అప్పట్లోనే 'ఆదిత్య 369' తీశాం. 'అన్‌స్టాపబుల్' కూడా అందులో ఒక భాగమే. ఆర్టిస్టుల ఇంకో కోణం కూడా ఆవిష్కరించాలి. అలాగే ఆర్టిస్టులు కూడా తాము బయటకు చెప్పుకోలేని నిజానిజాలు బయటకు వచ్చినప్పుడు వాళ్ల మనసుల్లోని బరువుతగ్గి నూతనోత్సాహంతో ముందుకు వెళ్తారు. నాకు పదహారేళ్లేనని చెప్తుంటా. నా ఆలోచనలు అలా ఉంటాయ్. వచ్చిన అవకాశాన్ని వెనకా ముందూ ఆలోచించలేదు. అరవింద్ అనే కాదు, ఈ ప్రపోజల్‌తో ఎవరొచ్చినా నేను చేసుండేవాడ్ని." అని ఆయన వెల్లడించారు.
Also read: బాలయ్య వందో చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`కి ఐదేళ్ళు!
"అరవింద్‌గారి ప్రత్యేకమేమంటే.. మా కుటుంబంతో ఉన్న చనువు. వాళ్ల నాన్నగారు అల్లు రామలింగయ్య గారితో మా నాన్నగారికి మంచి అనుబంధం ఉంది. అలా రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధంతో అరవింద్‌గారు అడిగారు. లేకపోతే నన్ను అడగడానికి కూడా చాలామంది భయపడతారు. ఆ దేవుడి దయవల్ల ఒక శుభముహూర్తాన మొదలుపెట్టాం. ఇవాళ ఇండియాలోనే నంబర్‌వన్ టాక్ షోగా రేటింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది." అని చెప్పుకొచ్చారు బాలయ్య.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



