37 ఏళ్ల తర్వాత కూడా బాలయ్య ఎనర్జీ వెనకున్న రహస్యమిదే!
on Jan 12, 2022

1984లో 'సాహసమే జీవితం', 'డిస్కోకింగ్' సినిమాలతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు ఎంత ఎనర్జీతో కనిపించారో, 37 ఏళ్ల తర్వాత 'అఖండ'లోనూ అంత ఎనర్జీతో కనిపించారు. "మీలోని ఈ ఎనర్జీ వెనుక ఉన్న రహస్యమేంటి?" అంటూ ఎదురైన ప్రశ్నకు తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు బాలయ్య. బుధవారం 'అఖండ' సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు బాలయ్య.
Also read: బాలయ్య వందో చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`కి ఐదేళ్ళు!
"రహస్యమేమీ లేదండీ.. రకరకాల పాత్రలు చెయ్యాలనే తపన, అవకాశాలు నాకు రావడం, మన పనిమీద తప్పితే వేరే వాటిమీద దృష్టిపెట్టకపోవడం.. నా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, నేనెన్ని సినిమాలు చేశాను.. ఇవేవీ నా బుర్రలో పెట్టుకోను. నా నిర్మాత బాగుండాలి. సినిమా తొందరగా అయిపోవాలి. పొద్దున్నే లేవడం, వ్యాయామం చెయ్యడం. ముఖ్యంగా నాన్నగారి సినిమాలు. నాన్నగారిని తలచుకోని రోజు ఉండదు. నాన్నగారి సినిమా చూడకుండా పడుకోవడం అనేది ఉండదు. పొద్దున్నే లేవడానికి అదో స్ఫూర్తి. ఆయన నాకు తండ్రే కాదు, దైవం, నా మెంటర్.. అంతా ఆయనే. నా అదృష్టం. ఆ తండ్రికి కొడుకుగా ఆయనలా అన్ని అవకాశాలు రావడం. పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, చారిత్రాక చిత్రాలు కానివ్వండి, ఫాంటసీ సినిమాలు కానివ్వండి.. భిన్నమైన నేపథ్యాల్లో సినిమాలు చేసే అవకాశం నాకు కలగడం" అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ.
Also read: బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ `పెద్దన్నయ్య`కి పాతికేళ్ళు!
ఇదే ప్రశ్నకు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా జవాబిచ్చారు. "బాలయ్య ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారంటే.. ఏదీ ఆయన లోపల దాచుకోరు. కుండ పగిలినట్లు మాట్లాడతారు. లోపల ఏదీ ఉండదు కాబట్టి, ప్లెజెంట్‌గా ప్రశాంతంగా ఉంటారు. ఆ క్షణంలో ఎలా చెయ్యాలో, ఆ క్షణంలో ఎలా బతకాలో అలా బతికేస్తారు. ఆ క్షణంలో ఏం అనాలనుకుంటే అది అనేస్తారంతే. అందుకే క్లీన్‌గా ఉంటారు. అందుకే అంత ఆరోగ్యంగా ఉంటారు." అని చెప్పారు బోయపాటి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



