అందుకే సినిమా టికెట్ ధరల తగ్గింపుతో మాకు ఇబ్బంది లేదు!
on Jan 12, 2022

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా ఏపీలో పలు థియేటర్స్ మూత పడ్డాయి. ఈ నిర్ణయం పెద్ద సినిమాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తెలుగు సినిమా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం సరి కాదని పలువురు తప్పుబడుతున్నారు. సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని పలువురు సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఈ నిర్ణయంతో తమకేం ఇబ్బంది లేదని చెబుతుండటం విశేషం.
అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో టికెట్ ధరల తగ్గింపుతో తనకేం ఇబ్బంది లేదని నాగార్జున చేసిన వివాదాస్పదమయ్యాయి. తాజాగా నాగ చైతన్య కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన చైతన్య.. టికెట్ ధరల తగ్గింపుతో తమకి ఎందుకు ఇబ్బంది లేదో చెప్పాడు.
"ఏపీలో సినిమా టికెట్ రేట్స్ గురించి నాన్నతో ముందే డిస్కస్ చేశాం. టికెట్ రేట్స్ జీవో అనేది ఏప్రిల్ లో వచ్చింది. ఆ తర్వాతే బంగార్రాజు షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఉన్న టికెట్ రేట్స్ ని బట్టే బడ్జెట్ ప్లాన్ చేసి తీసిన సినిమా ఇది. అందుకే టికెట్ రేట్స్ తక్కువ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మూవీ రిలీజ్ టైంకి రేట్స్ పెరిగితే బోనస్ అనుకున్నాం" అని చైతన్య చెప్పుకొచ్చాడు.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న 'థ్యాంక్యూ' మూవీ షూటింగ్ ముందే స్టార్ట్ అయిందిగా అని మీడియా ప్రస్తావించగా.. ఆ సంగతి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చూసుకుంటారు. యాక్టర్ గా నా సైడ్ నుండి నేను చేయాల్సింది చేస్తానని చైతన్య అన్నాడు.
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్' ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప విడుదలైన అన్ని చోట్లా లాభాలను చూసింది. టికెట్ రేట్స్ కారణంగానే ఏపీలో నష్టాలను మూటగట్టుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి టికెట్ రేట్స్ తో ఏ ప్రాబ్లమ్ లేదని చెబుతున్న అక్కినేని హీరోలు ఈ సంక్రాంతికి 'బంగార్రాజు'తో లాభాల బాట పడతారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



