విడాకులపై చైతన్య రియాక్షన్.. నేను, సమంత హ్యాపీ!
on Jan 12, 2022

తక్కువ టైంలో టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత.. ఊహించని విధంగా విడాకులు తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే సమంత విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన చైతన్య.. ఆ తర్వాత విడాకుల గురించి పెద్దగా మాట్లాడలేదు. అటు సమంత, ఇటు చైతన్య ఎవరికివారు వారి జీవితాల్లో బిజీ అయిపోయారు. అయితే తాజాగా విడాకుల అంశంపై చైతన్య స్పందించాడు. ఇద్దరి సంతోషం కోసమే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పాడు.
తండ్రి నాగార్జునతో కలిసి చైతన్య నటించిన బంగార్రాజు సినిమా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన చైతన్యకు సమంతతో విడాకులకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. పర్సనల్ లైఫ్ లో ఈమధ్య టఫ్ డేస్ ఎదుర్కొన్నారు. దాని నుండి ఎలా బయటపడ్డారు అని అడగగా.. ఆ టైంలో ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసిందని చైతన్య చెప్పాడు. అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమని, ఆ నిర్ణయంతో తను, నేను ఇద్దరం హ్యాపీ అని తెలిపాడు. ఆ సిచ్యువేషన్ లో ఇద్దరికీ అదే బెస్ట్ డెసిషన్ అనిపించిందని చైతన్య అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



