'ఆర్ఆర్ఆర్'లో గెస్ట్ రోల్స్ కోసం అజయ్ దేవ్‌గణ్‌కు 35 కోట్లు.. ఆలియాకు 9 కోట్లు!
on Jan 11, 2022

యస్.యస్. రాజమౌళి రూపొందించిన మాగ్నమ్ ఓపస్ 'ఆర్ఆర్ఆర్'లో హీరోలుగా నటించడానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తమ రక్తం, చెమట ధారపోశారు. ఆ సినిమా కోసం ఆ ఇద్దరూ పడిన శ్రమ మామూలుది కాదు. తారక్ అయితే మూడేళ్ల పాటు వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా 'ట్రిపుల్ ఆర్'కు అంకితమయ్యాడు. తారక్, చరణ్‌కు ఈ సినిమా కోసం నిర్మాత డీవీవీ దానయ్య ఇచ్చిన రెమ్యూనరేషన్ రూ. 45 కోట్లు అని ప్రచారంలో ఉంది.
Also read: యంగ్ బ్యూటీ మాయలో చైతన్య.. 'బంగార్రాజు' సాక్షిగా దొరికిపోయారు!
ఇదే సినిమాలో బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ చిన్న పాత్రలు చేశారు. ఆ ఇద్దరివీ గెస్ట్ రోల్స్ అని చెప్పొచ్చు. అయినప్పటికీ ప్రధాన పాత్రల్లో నటిస్తే ఎంత రెమ్యూనరేషన్ వారికి అందుతుందో అంత మొత్తం వారు పొందారు. "హిందీ సినిమాల్లో నటించడానికి ఇతర నిర్మాతల నుంచి సాధారణంగా ఎంత చార్జ్ చేస్తుందో అంత అమౌంట్ ఆలియా భట్ అందుకుంది. 'ట్రిపుల్ ఆర్'లో పేరుకు హీరోయిన్ అయినా ఆమె కనిపించేది 20 నిమిషాలే. దీని కోసం ఆమెకు రూ. 9 కోట్లు చెల్లించారు" అని బాలీవుడ్ వర్గాలు తెలియజేశాయి.
Also read: కొత్త హీరోతో అనుపమ లిప్ లాక్.. 'డబ్బిస్తే ఏమైనా చేస్తావా?' నెటిజన్స్ ట్రోలింగ్!
ఇక అజయ్ దేవ్‌గణ్ విషయానికొస్తే ఆయన పాత్ర ఒక కీలక ఘట్టంలో వస్తుంది. "ఆయనది గెస్ట్ అప్పీరెన్స్ అయినప్పటికీ కథకు అది కీలకం. కేవలం 7 రోజుల షూటింగ్‌కు ఆయనకు ఏకంగా రూ. 35 కోట్లు దక్కాయి. నార్త్ ఇండియాలో ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే కరిష్మా దేవ్‌గణ్, ఆలియాలకు ఉంది. వారు కాకుండా ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన నార్త్ ఇండియెన్స్‌కు బాగా తెలిసింది రాజమౌళి మాత్రమే." అని ఆ వర్గాలు తెలిపాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



