ENGLISH | TELUGU  

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో మళ్ళీ న‌టించాల‌ని ఉంది

on Jan 11, 2022

అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా 'హీరో'. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం నాడు మీడియాతో ముచ్చటించిన నిధి అగర్వాల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

* పెద్ద స్టార్స్‌తో న‌టించినా గ‌ల్లా అశోక్ తో న‌టించ‌డం క‌ష్టం అనిపించ‌లేదు. త‌ను హీరోగా ప్రిపేర్ అయి వున్నాడు. అందుకే న‌టుడిగా కొత్త‌వాడ‌నే ఫీల్ నాకు క‌ల‌గ‌లేదు.

* ఇస్మార్ట్ శంక‌ర్‌లో డాక్ట‌ర్‌గా చేశాను. హీరో సినిమాలోనూ అలాంటి పాత్రే వ‌చ్చింది. కానీ తేడా వుంటుంది. నా పేరు సుబ్బు. నా ఫాద‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు గారు. హీరో తండ్రిగా న‌రేశ్ గారు న‌టించారు. ఈ క‌థ రెండు కుటుంబాల మ‌ధ్య జ‌రిగే డ్రామా. సంద‌ర్భానుసారంగా కామెడీ కూడా వుంది. క‌థ‌లో కొన్ని ట్విస్ట్‌లుకూడా వున్నాయి.

* నేను క‌థ విన్న‌ప్పుడు నా పాత్ర‌వ‌ర‌కే ఆలోచిస్తాను. న‌ట‌నా ప‌రంగా ఎంత‌మేర న్యాయం చేయ‌గ‌ల‌నే చూస్తాను. గ‌ల్లా అశోక్ కొత్త అనే ఫీల్ నాకు క‌ల‌గ‌లేదు. నేను ఆయ‌న‌కు ఏమీ హెల్ప్ చేయ‌లేదు కానీ డాన్స్ ప‌రంగా తనే కొంచెం హెల్ప్ చేశాడు.

* హీరో సినిమాలో గ‌ల్లా అశోక్ అద్భుతంగా న‌టించాడు. ఇది సంక్రాంతికి ఫ‌ర్‌ఫెక్ట్ మూవీ. సాంగ్స్ బాగా వ‌చ్చాయి.

* ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత కోవిడ్ వ‌ల్ల చాలా గ్యాప్ వ‌చ్చింది. అందుకే తెలుగులో చేయ‌లేక‌పోయా. కానీ హిందీ, త‌మిళ సినిమాలు చేశా.

* నేను పుట్టింది హైద‌రాబాద్‌లోనే. అందుకే తెలుగువారికి బాగా క‌నెక్ట్ అయ్యాను. హిందీ, త‌మిళ సినిమాలు చేసినా తెలుగు ప‌రిశ్ర‌మ అంటేనే నాకు చాలా ఇష్టం.

*ఇస్మార్ట్ చేశాక గ్లామ‌ర్ హీరోయిన్ అనే పేరు నాపై వుంది. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డం అనేది కూడా నాకు ప్ల‌స్ పాయింటే. త‌మిళంలో ఒక సినిమా చేస్తున్నాను. అందులో కేరెక్ట‌ర్‌కు మేక‌ప్ వుండ‌దు. డ‌ల్ వాతావ‌ర‌ణంలో ఫేస్ డ‌ల్‌గా క‌నిపించాలి. ఇలాంటి పాత్ర‌లు ద‌ర్శ‌కుల నుంచి పుట్టిన‌వే. ఇలాంటి ఏ భాష‌లో వ‌చ్చినా చేస్తాను.

* ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్న పెద్ద హీరోల‌నే తేడా లేకుండా ద‌ర్శ‌కుడు నాపై వుంచిన న‌మ్మ‌కాన్ని నిలబెట్టేలా చేస్తాను.
 
* నాకు యాక్ష‌న్ పాత్ర‌లంటే ఇష్టం. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లో  కొంచెం యాక్ష‌న్ సీన్స్ వున్నాయి. చాలా ఇష్టంగా చేశాను. ప‌వ‌న్ కళ్యాణ్ లో నేను గ‌మ‌నించింది ఏమంటే, చాలా కూల్‌గా వుంటారు. ప‌వన్ సార్ సినిమాలో పెద్ద రోల్‌. బెస్ట్ రోల్ నాకు ద‌క్కింది. ఇది పీరియాడిక్ మూవీ. చాలా బాగుంటుంది.

* అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మంచి న‌టులు. వారితోపాటు కొత్త హీరోల‌తోకూడా నేను న‌టిస్తాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మళ్ళీ న‌టించాల‌ని ఉంది.

* నాకు ఓటీటీ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ వెండితెర‌కే ముందు ప్రాధాన్య‌త ఇస్తా. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రూస్టోరీస్‌.. సీరిస్ నాకు బాగా న‌చ్చింది.

* నేను సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటాను. న‌టికాక‌ముందే నాకు ఒన్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ వున్నారు. సోష‌ల్‌మీడియా వ‌ల్ల నా ఫొటోలు చూసి నేను ప‌లానా పాత్ర‌కు స‌రిపోతాన‌ని కొంద‌రు ద‌ర్శ‌కులు పిలుస్తుంటారు. ఇది నాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది. ఇక ప‌లువురు విమ‌ర్శ‌లు కూడా ఘాటుగానే వుంటాయి. కాస్త ఇబ్బంది పెట్టినా వాటిని ప‌ట్టించుకోను.

* తెలుగులో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు త‌ర్వాత ఇంకా ఏమీ కమిట్ కాలేదు. కొన్ని క‌థ‌లు చ‌ర్చ‌ల్లో వున్నాయి. ఏప్రిల్‌లో హిందీ సినిమా ప్రారంభం కాబోతోంది. త‌మిళంలో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో సినిమా చేశాను. మ‌రో సినిమా లైన్‌లో వుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.